గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గణప సముద్రంలో పూడిక తీత శనివారం రోజున ఉపాధి హామీ పనులు జరుగుతుండగా పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి హామీ కూలీలకు కావలసిన సదుపాయాలను కల్పిస్తామని గణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి విజేందర్ అన్నారు. ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజు కొలతల ప్రకారం పని చేసినట్లయితే ప్రభుత్వం నిర్ణయించిన కూలీ డబ్బులు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన మస్టర్లను పరిశీలించి వాటిలో ఉన్నటువంటి పేర్లు చదివి వినిపించారు. మస్టర్లలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని మేట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దూలం శ్రీదేవి ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులను పరిశీలించిన కార్యదర్శి విజేందర్
