కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటిధాత్రి:
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో గ్రామ పంచాయతీ కార్యకలాపాల నిర్వాహణ కోసం పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కార్యదర్శులు కోరుతున్నారు. మార్చి నుండి నిర్వహణ సాధ్యం కాదని వారు పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం మండలంలో ఎంపీడీవో కమలాకర్ కు, ఎంపీవో రాములుకు వినతిపత్రాలు అందజేశారు. గతేడాది ఆగస్ట్ నుండి పెండింగ్లో ఉన్న చెక్కుల చెల్లింపులు మరియు జీపీ నిర్వహణ నిధులు విడుదల చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు వినోద్, రాము, లక్ష్మణ్ బాలరాజ్, కృష్ణ, సునీల్, సాయిబాబా, గులాబ్, హుస్సేన్, భాస్కర్, రవి, అంబయ్య, శేఖర్, వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.