రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

శాస్త్రీయ సేంద్రియ వ్యవ సాయ పద్ధతులపై అవగా హన

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం మైలా రం గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సేంద్రియధృవీకరణ,శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయ నిర్వ హణ పద్ధతులపై రైతులకు సమగ్ర అవగాహన కల్పిం చారు..ముఖ్యవక్తలుగా డా. బి. విద్యాధర్ ప్రొఫెసర్, డా.సిద్ధార్థ నాయక్, టీచింగ్ అసోసియేట్ పాల్గొని సేంద్రి య వ్యవసాయం ద్వారా నేల భౌతిక, రసాయన, జీవ లక్ష ణాల మెరుగుదల గురించి వివరించారు. రసాయన ఎరువులు మరియు క్రిమిసం హారక మందుల అధిక విని యోగం వల్ల నేల సూక్ష్మజీ వుల సమతుల్యత దెబ్బ తింటుందని, దీని ప్రభావం దిగుబడులపై దీర్ఘకాలికంగా పడుతుందని తెలిపారు.
జీవామృతం, ఘన జీవా మృతం, వర్మీ కంపోస్ట్, పంట అవశేషాల పునర్వినియోగం, గ్రీన్ మ్యాన్యూరింగ్, బయో ఫెర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్ వినియోగం ద్వారా నేల సేంద్రియ కార్బన్ శాతం పెరిగి, నీటి నిల్వ సామర్థ్యం మరియు పోషక లభ్యత మెరుగుపడుతుందని వివరించారు.

సేంద్రియ ధృవీకరణ (Organic Certification) ద్వారా ఉత్పత్తుల నాణ్యతకు అధికారిక గుర్తింపు లభించి, రైతులు జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం ఉంటుందని తెలిపారు. Participatory Guarantee System (PGS) మరియు NPOP విధానాల ద్వారా ధృవీకరణ ప్రక్రియను రైతులు సులభంగా పొందవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని గారు మాట్లాడుతూ వరి మరియు మొక్కజొన్న పంటల కోతల అనంతరం రైతులు పంట అవశేషాలను తగులబెట్టకుండా, వాటిని నేలలో కలిపి భూమి సారాన్ని పెంచుకోవాలని సూచించారు.

వారు మాట్లాడుతూ పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్ తగ్గిపోవడం, సూక్ష్మజీవుల నష్టం, పోషకాల హ్రాసం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్, గంధకం వంటి ముఖ్య పోషకాలు నష్టపోతాయని వివరించారు.

పంట అవశేషాలను త్వరగా కుళ్లించేందుకు ఎస్ ఎస్ పి ప్లస్, యూరియా పద్ధతి, పూసాడీ కంపోజర్, ఎన్ సి ఓ ఎఫ్ ఘాజియాబాద్ వేస్ట్ డీకంపోజర్, ట్రైకోడెర్మా వంటి జీవ డీకంపోజర్ల వినియోగంపై రైతులకు ప్రాయోగిక సూచన లు అందించారు. రైతులకు ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు సేంద్రియ వ్యవసాయ ప్రోత్సా హక కార్యక్రమాలను వివరిం చారు ఈ కార్యక్రమంలో మం డల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని, వ్యవసాయ విస్తరణ అధికారి అన్వేష్ గ్రామ సర్పంచ్ దివ్య , ప్యాక్స్ చైర్మన్ తిరుపతిరెడ్డి,వ్యవసా య విద్యార్థులు గీతజుహా అల్మీన్ పాల్గొన్నారు.
.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version