
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండల కేంద్రం నుండి మణుగూరు వెళ్లే మార్గంలో సాయనపల్లి నుండి వీరాపురం వెళ్లే రహదారి గురుంచి గుండాల కాంగ్రెస్ మండల నాయకులు అలాగే గుండాల మండల ప్రజలు కొద్దిరోజుల క్రితం నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందించి వారి ఇబ్బందులను ఎమ్మెల్యే కి విన్నవించుకోగ వారి సమస్య ను తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని గుండాల మండలం గుండా మేడారం వెళ్లే ప్రయాణికులకు ఇబంది కలగకుండా రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని అలాగే పనులకు సంబందించిన ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించడం జరిగింది కాగా దానికి సంబందించిన ఖర్చులకు 6లక్షల రూపాయలను మంజూరు చేపించడం జరిగింది కాగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 15,02,2024 న రోడ్డు పనులు ప్రారంభం జరుతున్న సందర్బంగా మండల కాంగ్రెస్ నాయకులు అలాగే ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు తెలియజేయండి జరిగింది. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కొడెం ముత్యమాచారి,పాయం యువసేన మండల కో-ఆర్డినేటర్ ఖధీర్,ఎంపీటీసీ కృష్ణారావు, ముత్తాపురం మాజీ సర్పంచ్ పూనెం సమయ్య, సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య,సీపీఐ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, టీజెఎస్ మండల అధ్యక్షులు గోల్లేపల్లి రమేష్, మండల యువజన నాయకులు దార అశోక్, ఇస్రార్, కాసీం, బొంగు చంద్రశేఖర్, ఇర్ప కన్నయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.