శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-
చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డిని కోరారు. అభివృద్ధి పేరుమీద ఒకవైపు, లేక్ బ్రీజ్, లేక్ వ్యూల పేరుమీద మరోవైపు కార్పోరేట్ సంస్థల కుట్రపూరిత అభివృద్ధి కార్యక్రమాలు చెరువులను అన్యాక్రాంతం చేస్తున్నాయని కసిరెడ్డి భాస్కరరెడ్డి తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. అభివృద్ధి పేరుమీద చెరువుల్లో నీరులేకుండా చేయడం వల్ల పరిసర ప్రాంతాల బోర్లు ఎండిపోయి వచ్చే ఎండాకాలంలో నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని జనం కోసం తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. చెరువుల్లో జీహెచ్ఎంసీ గుడ్డిగా పర్మీషన్ ఇవ్వడాన్ని నిరోధించాలని జనం కోసం తహసీల్దార్ ను కోరింది. నల్లగండ్ల పెద్ద చెరువు కబ్జాలపై ఆపర్ణ సంస్థపై చర్యలు తీసికొని, చెరువును కాపాడాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిప్యూటీ కలెక్టర్ కం తహసీల్దార్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.