చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మహా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి మాట్లాడుతూ.. ప్రతినెల పౌర్ణమి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం పూజ నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఇట్టి పూజా కార్యక్రమంలో కూర్చున్న దంపతులకు కోరిన కోరికలు తీరుతాయని సకల సంపదలు ఆయురారోగ్యాలు ఆ స్వామి ప్రసాదిస్తారని అన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు , మహిళలు ,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.