# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్.
నర్సంపేట,నేటిధాత్రి :
గోల్గొండ ఢిల్లీ కోటపై బహుజన జెండా ఎగురవేసిన తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు. నర్సంపేట పట్టణం లోని పాపన్న సెంటర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి కార్యక్రమం విగ్రహా కమిటీ అధ్యక్షులు సొల్తీ సారయ్య గౌడ్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. మొదట పాపన్న గౌడ్ విగ్రహం నకు సొల్తీ సారయ్య గౌడ్, అనంతుల రమేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రమేష్ గౌడ్ మాట్లాడుతూ బహుజనులు బాగుపడాలంటే రాజ్యాధికారం తోనే సాధ్యమని పాపన్న గౌడ్ భావించాడన్నారు. ఆ దిశగా పాపన్న గౌడ్ 12 వేల మంది సైన్యంతో 21 కోటలు జయించిన బహుజన రాజ్యం స్థాపించాడన్నారు. పోరాడిన వాడే పరిపాలనకు అర్హుడని స్థానిక ప్రజల తరుపున 30 సంహాత్సరాలు పరిపాలన చేశాడని పేర్కొన్నారు. ఏడున్నర ఏళ్లుగా గోల్కొండ కోట చక్రవర్తిగా పాలన సాగించాడని ఆయన వివరించారు.మొగలాయిల
పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన దక్షిణ భారత సింహం, పెన్నా నది నుండి బీమా నది వరకు పాలించిన స్వతంత్ర రాజు పాపన్న గౌడ్ అని ఆయన సేవలను కొనియాడారు. బహుజనులందరు ఐకమత్యంతో ఉండి బహుజనులందరిని ఏకం చేసిన రోజే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, గౌరవ అధ్యక్షులు ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు గంప రాజేశ్వర్ గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్, జిల్లా నాయకులు బోడిగే మల్లేశం గౌడ్, జూలూరి హరిప్రసాద్ గౌడ్, పంజాల వెంకట్ గౌడ్, పుల్లూరి శ్రీనివాస్ గౌడ్, జూనురి నరేష్ గౌడ్ , ముంజ అశోక్ గౌడ్ కొండి రాము గౌడ్, బూర అశోక్ గౌడ్,జేఏసీ నాయకులు సాంబరాతి మల్లేశం,వేముల రవి గౌడ్, గుండె బోయిన హరిప్రసాద్ గౌడ్, తాబేటీ రవి గౌడ్, గండి రాము గౌడ్, డివిజన్ నాయకులు నాంపల్లి వెంకట్ గౌడ్,ఎరుకొండ రాజేందర్ గౌడ్,మండల నాయకులు గండి గిరి గౌడ్, మేరుగు గంగాధర్ గౌడ్,సొల్తీ సాంబయ్య గౌడ్, దూపటి కుమార్ గౌడ్, మంద కుమార్ గౌడ్, గొల్లపల్లి సురేష్ గౌడ్, జూలూరి శివ ప్రసాద్ గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, సొల్టీ మధు గౌడ్, సొల్తీ అనిల్ గౌడ్,
పోశాల సతీష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.