అచ్చ సుదర్శన్ ప్రధానోపాధ్యాయులు
నడికూడ,నేటి ధాత్రి:మండలంలోని చర్లపల్లి గ్రామం సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి సేవలు చిరస్మరణీయమని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అన్నారు.సర్పంచుల ఐదు సంవత్సరముల పదవీకాలం గత నెలతో ముగిసిన సందర్భంగా చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్స్ సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చాడ తిరుపతి రెడ్డి కి పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానం చేసి సన్మాన పత్రాన్ని బహుకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ సర్పంచిగా తన పదవి కాలంలో గ్రామ అభివృద్ధితోపాటు, పాఠశాల విద్యాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేసి మన ఊరు మన బడినీ త్వరితగతoగా పూర్తి చేసిన సర్పంచ్ సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా అన్నారు. పదవులు వ్యక్తికి వన్నెతెస్తే ఆ పదవికే వెన్నెతెచ్చిన వ్యక్తి చాడ తిరుపతిరెడ్డి అని కూడ అన్నారు. పదవి ఉన్నా లేకున్నా పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్, నిగ్గుల శ్రీదేవి అన్నారు. చర్లపల్లి అంగన్వాడి సెంటర్ ను సుందరంగా జిల్లాలోనే తీర్చిదిద్దిన ఘనత సర్పంచ్ దేనని అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ ,సంధ్య, సరిత,మంజుల అన్నారు. సర్పంచ్ లకు చాడ తిరుపతిరెడ్డి రోల్ మాడల్ అని పంచాయతీ కార్యదర్శి శ్వేత, విద్యా వాలంటీర్ పర్శవేని జ్యోతి, ఐఆర్పి రమేష్ అన్నారు. సన్మాన గ్రహీత మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి, పాఠశాల విద్యాభివృద్ధికి, విద్యార్థులకు పదవి ఉన్నా లేకున్నా నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఆయాలు సుశీల, అరుణ, సరోజన తదితరులు పాల్గొన్నారు.