సంక్రాంతి ముగ్గుల పోటీల్లో బహుమతులు ఇచ్చిన సర్పంచ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్ ఉప సర్పంచ్ కానిపర్తి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీని అప్పయ్య పల్లె గ్రామ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంతో పోటీపడి ముగ్గులు వేసిన అక్క చెల్లెళ్లకు గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు సర్పంచ్ తెలిపారు వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ముగ్గుల పోటీలు జరుపుకుంటున్నాము ఈ సంక్రాంతి ముగ్గులు వేసినటువంటి ఆడపడుచులకు బహుమతులు గ్రామ పెద్దల ముందు పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 1516 రూ కాసర్ల మేనక రెండో బహుమతి ఎలుక పెళ్లి కళ్యాణి మూడో బహుమతి తొట్ల అఖిల సర్పంచి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొడారి రవీందర్ పిఎసిఎస్సి మాజీచైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ సీనియర్ నాయకులు మార్నేని ఉపేందర్ రావు ఐలోని రామచందర్ రెడ్డి ఓం బోల్లెండ్ల ప్రభాకర్ రెడ్డి దోమల రాజయ్య దోమల రవీందర్ మారేపల్లి మహేందర్ రెడ్డి కొత్తగట్టు రమేష్ ఇనుగాల మొగిలి వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పాల్గొన్నారు
