మహిళలకు చీరలు పంచిన సర్పంచ్
గొల్లపల్లి సర్పంచ్ ఊడిగే ఉదయ్ కుమార్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం గొల్లపల్లి గ్రామంలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గొల్లపల్లె సర్పంచ్ ఉడిగే ఉదయ్ కుమార్ అన్నారు శుక్రవారం గొల్లపల్లి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ చీరలను సర్పంచ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులో లేని మహిళలకు ఇందిరమ్మ మహిళ శక్తి పథకంలో భాగంగా ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు మహిళా అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అధ్యక్షతన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు ఈ అంశములను అందిపుచ్చుకొని మహిళలు సామాజిక రాజకీయంగా ఎదగాలని సర్పంచ్ ఈ సందర్భంగా అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సిఏ మహిళలు పాల్గొన్నారు
