
Seasonal diseases
గ్రామాలలో పడకేస్తున్న పారిశుధ్యం..
◆: కరువైన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ
◆: సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు సోకె అవకాశం
◆: పంచాయతీల్లో నిధులు లేక అనేక అవస్థలు
◆: పారిశుధ్యాన్ని పాటించక చేతులెత్తేస్తున్న కార్యదర్శులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : మండలంలోని 35 గ్రామపంచాయతీలలో వివిధ గ్రామాలలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది.డీజిల్ కు డబ్బులు లేక పారిశుధ్య కార్మికులు పనిచేయడం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు సొంత తన జేబులో డబ్బులు ఇచ్చి డీజిల్ కి చిన్నచిన్న రిపేర్లకు వారి జీతంలో నుండి పెట్టుబడి పెడుతున్నామని వాపోతున్నారు. గ్రామపంచాయ తీలో నిధులు లేక ఇబ్బందులతో పనులను చేయలేక పోతున్నామన్నారు. ఇప్పటివరకు 35 గ్రామ పంచాయతీలలో కొన్ని గ్రామపంచాయతీలలో సపాయి కార్మికులుగా పనిచేస్తున్న కొంతమంది పనిచేయకుండా జీతాలు అడుగుతున్నారని మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బడ్జెట్ లేక మేము ఏమి చేయలేకపోతున్నాము ఏదో విధంగా సర్దుబాటు చేసుకోగలరని అధికారులు పంచాయతీ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి మండలం లోని గ్రామంలోని 35 గ్రామపంచాయతీలో గల పారిశుధ్య పనులు చక్కబెట్టి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. ప్రత్యేక అధికా రులను నియమించిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు విమర్శలు చేస్తున్నారు.