సిద్ధార్థ్ రాజ్ ను అభినందించిన సంఘమిత్ర టెక్నో స్కూల్ యాజమాన్యం
సంఘమిత్ర టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి పేరెంట్స్
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ తూర్పు పరిధిలో, దేశాయిపేట రోడ్డులో ఉన్న సంఘమిత్ర టెక్నో స్కూల్ లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి కందికొండ సిద్ధార్థ్ రాజ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 27న జరిగిన “సుచిరిండియ సి.వి రామన్ టాలెంట్ టెస్ట్” లో, రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో ర్యాంకు, వరంగల్ జిల్లాలో మొదటి ర్యాంకు సాధించిన సందర్భంగా స్కూల్ యాజమాన్యం సిద్ధార్థ్ రాజ్ కు పాఠశాల కరస్పాండెంట్ మహేందర్ సార్, వెంకట్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో సిద్ధార్థ్ ను అభినందించారు. ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ లో అవార్డ్స్ ఇవ్వనున్నట్లు సుచిరిండియ సి.వి రామన్ వారు తెలిపారు. సంఘమిత్ర టెక్నో స్కూల్ లోని విద్యార్థి సిద్ధార్థ్ రాజ్, సుచిరిండియ సి.వి రామన్ టాలెంట్ టెస్ట్ లో బాగంగా ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష రాసి, పాఠశాల కరస్పాండెంట్ మహేందర్ సార్ ఆధ్వర్యంలో సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థి జిల్లాలోనే మొదటి ర్యాంకు రావడం గర్వకారణం. సంఘమిత్ర టెక్నో స్కూల్ లో పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్నతమైన చదువు అందిస్తున్న పాఠశాల యాజమాన్యంకు విద్యార్థుల పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి సిద్ధార్థ్ రాజ్ మాట్లాడుతూ సంఘమిత్ర టెక్నో స్కూల్ కరస్పాండెంట్ మహేందర్ సార్, వెంకట్ రెడ్డి సార్, స్కూల్ టీచర్ల సపోర్ట్ తోనే మొదటి ర్యాంకు సాధించినట్లు తెలిపారు.