జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామ పరివాహక ప్రాంతంలోని మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం పట్టుకున్నట్లు జమ్మికుంట ఎస్సై ఎస్ రాజేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మానేరు వాగు నుండి ఇసుకను తరలిస్తూ సైదాబాద్ క్రాసింగ్ వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి ఇసుక ట్రాక్టర్ యజమాని రాచపల్లి శ్రీకాంత్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే మరొక ట్రాక్టర్ ను ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న మరొక ట్రాక్టర్ ను పట్టుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హుజురాబాద్ కి చట్టరీత్యా తగు చర్యల గురించి పంపించినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన వాటి సమాచారం తమకు అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నాని అన్నారు.