
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,
ధర్మపురి నియోజక వర్గం, ఎండపల్లి,మండలం గుల్ల కోటకి చెందిన సాన లక్ష్మణ్ ప్రభావతి దంపతులు నిత్య జీవితంలో ఎన్నో రకాలుగా,ఎంతోమందికి తమకు తోచిన విధంగా,సేవా కార్యక్రమాలు చేస్తూ,ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు,గురువారం జరిగిన నిరుపేద కుటుంబానికి చెందిన ఆడ పడుచు పొన్నం సతవ్వ మల్లయ్య దంపతులకు చెందిన కూతురు వివాహానికి పుస్తెలు మట్టెలు అందించడంతో వారి కుటుంబం లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి,వారు చేసిన సాయానికి నిరు పేద కుటుంబానికి అండగా నిలిచారు, వీరే కాకుండా ఎంతో మంది దాతలు ,యువకులు,ముందు ఉండి వారి కుటుంబానికి అండగా నిలిచారు,ఎంతైనా అందరూ ఉండి కూడా సహాయం చేసే గుణం లేని ,పట్టించుకునే వారు లేని ఈ రోజుల్లో, ఇలా యువకులు దాతలు ముందుకు వచ్చి,మా కూతురు వివాహానికి ముందు ఉండి జరిపించి,సహాయ, సహకారాలు అందించిన వారందరికీ నిరుపేద తల్లి తండ్రులు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి ,సాన మారుతి,గ్రామ యువకులు,పెద్దలు,అభిమానులు పాల్గొన్నారు