
Sammi Goud Leads Special Ganesh Pooja and Lucky Draw
గణనాధుని ప్రత్యేక పూజల్లో సమ్మి గౌడ్ చిలువేరు
సమ్మి గౌడ్ చేతులమీదుగా లడ్డు లక్కీ డ్రా -విజేతలకు అందజేత
సభ్యులందరికీ సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి 45 టీ షర్ట్ లు అందజేత
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ లో కేసరి మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపానికి యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొని గణనాధుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు కాంగ్రెస్ మండల నాయకులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసరి మిత్ర యూత్ సభ్యులు, విలేజ్ కేసముద్రం గ్రామ ప్రజలు, ఆటో యూనియన్ సభ్యులు ఆ వినాయకుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం లడ్డు పాట వేలం వేయగా లడ్డు, కలశం, పంచ కండువాలు చీటీ డ్రా సమ్మి గౌడ్ చేతుల మీదుగా తీసి గణపతి లడ్డు గెలుచుకున్న కొలిపాక గోపి,కలశం గెలుచుకున్న వేల్పుల శ్రీ హర్ష,పంచ,కండువా గెలుచుకున్న నార బోయిన రమేష్ లకు అందజేయడం జరిగింది.అన్నా అంటూ ఆదరిస్తున్న కేసరి యూత్ సభ్యులు అడిగిన వెంటనే స్పందించి వారికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి 45 టీ షర్టులను అందజేశారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ… మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న మా అన్న సమన్నకు ఎల్లవేళలా మేము తోడుంటామని, అదేవిధంగా ఆ ఏకదంతుని ఆశీస్సులు సమ్మి గౌడ్ అన్నకు తన ఆశయాలు నెరవేర్చడంలో తోడ్పడాలని కోరుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డొనికల రాజు, కొమ్ము నరేష్,ఎస్కే తాజా,ఎస్ కే యాకూబ్, నాగరాజు,సందీప్, సాయి,దాసరి సందీప్,సిహెచ్ సురేష్, శ్రీనాథ్,ఈశ్వర్,భక్తులు తదితరులు పాల్గొన్నారు.