
కంకవణం గద్దెలకు చేరడం తో మొదలైన జాతర…
రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 20, నేటిధాత్రి:
నేటి నుండే సమ్మక్క సారలమ్మ జాతర షురూ అయ్యింది, కోల్ బెల్ట్ ప్రాంతమైన మందమర్రి ఏరియాలోని ఆర్కేవన్-ఏ గని పరిసర ప్రాంతంలో సందడి వాతావరణం ఏర్పడింది.జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం మంగళవారం కంకవనం గద్దెకు చేరింది.అమ్మవార్లు రావడానికి ముందే కోయ పూజార్ల కుటుంబికులు సాంప్రదాయం ప్రకారం డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా కంక వనాన్ని గద్దెలపై పూజారులు ప్రతిష్టించారు.పేరుకు గిరిజన జాతర అయినప్పటికి అన్ని వర్గాలకు చెందిన భక్తులు భక్తి శ్రద్ధలతో వనదేవతలను పూజిస్తున్నామని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ పేర్కొన్నారు.ఈ నెల 22నుంచి 24 వరకు జాతరలో సమ్మక్క సారలమ్మ తల్లులను భక్తులు దర్శించి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు,కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.