వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
కొండా మురళికి దగ్గరి అనుచరుడుగా పేరొందిన సద్దాం
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
కొండా మురళికి దగ్గరి సన్నిహితుడుగా పేరున్న, వరంగల్ జనతా క్యాబ్స్ అధినేత సద్దాం తన అనుచరులతో భారీ ఎత్తున కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వంచనగిరి ప్రాంతానికి చెందిన సద్దాం, కొండా మురళికి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. శనివారం రోజున సద్దాం, అతని అనుచరులను హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కెటిఆర్ బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సద్దాం మాట్లాడుతూ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపనేని నరేందర్ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తామని తెలిపారు.