
RTC employees
మాధక ద్రవ్యాల నిర్మూలనపై ఆర్టీసీ ఉద్యోగుల ప్రతిజ్ఞ
బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలి: డి.ఎం ప్రసూన లక్ష్మీ
నర్సంపేట,నేటిధాత్రి:
మాధక ద్రవ్యాల నిర్మూలనపై ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో ఉద్యోగులకు మాధక ద్రవ్యాల నిర్మూలన గురించి అవగాహన కల్పించారు.డ్రగ్స్,గంజాయి ఇతర మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉద్యోగులలో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ మాట్లాడుతూ రాఖీ పండుగ సందర్బంగా ఉద్యోగులు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డ్యూటీ చేసి డిపో ఆధాయానికి కృషి చేసిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలుపుతూ మిఠాయి పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో సూపరెండెంట్ రంజిత్,సెక్యూరిటీ హెడ్ వీరారెడ్డి, ఆఫీస్ స్టాఫ్, గ్యారేజ్ స్టాఫ్, సూపర్ వైజర్ లు డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.