రూ. 50 వేల కంటే ఎక్కువ తరలిస్తే సీజ్ చేయాలి

ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీలకు శిక్షణలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్

వేములవాడ, నేటిధాత్రి:


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యoలో సరైన ఆధారాలు లేకుండా రూ. 50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే సీజ్ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. ఎఫ్ఎస్టీ ( ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్) ఎస్ఎస్టీ( స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్)
వీఎస్టీ( వీడియో సర్వెలెన్స్ టీమ్)లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడారు.
ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ సభ్యులు డబ్బులు, మద్యం, గిఫ్ట్ ప్యాకులు సీజ్ చేసే క్రమంలో వీడియో తీయాలని సూచించారు. సీజ్ చేసిన వాటికి సంబంధించి రసీదు అందజేయాలని తెలిపారు. డబ్బు తీసుకెళ్లే వారు వాటికి సంబంధించి పత్రాలు, ఆధారాలు వెంట ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అధికారులు బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీలకు విధుల్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు.
రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులు, సామగ్రి జీఎస్టీ బిల్లు లేకుండా తరలిస్తే సీజ్ చేయాలని తెలిపారు. అలాగే నోడల్ ఆఫీసర్ రఫీ సీ విజిల్ యాప్ వినియోగం, ఫిర్యాదులు వస్తే ఎంత సమయంలోగా చేరుకోవాలి, దానిని ఎన్ని నిమిషాల్లో క్లోజ్ చేయాలనే అంశాలపై వివరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!