Elders Demand ₹4000 Pension in Zaheerabad
వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్లు: జహీరాబాద్లో డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ల పెంపు అంశం విస్మరించబడిందని విమర్శలు వస్తున్నాయి. ఆరు గ్యారెంటీల్లో భాగంగా పెన్షన్ పథకం కొనసాగుతున్నప్పటికీ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన పెంపు హామీ ఇప్పటికీ నెరవేరలేదు. బడ్జెట్ లోపం కారణమని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ.. ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, ప్రత్యేకంగా దివ్యాంగుల పెన్షన్ పెంపు తక్షణమే అమలు చేయాలని జహీరాబాద్ నియోజకవర్గ వృద్ధులు గురువారం తమకు రూ. 4 వేల పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని వారు అభ్యర్థించారు. ఈ డిమాండ్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
