15 Crore Grant for Kohir Municipality
మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో మున్సిపాలిటీలో రోడ్లు, మురుగు కాలువలు, మౌలిక వసతుల నిర్మాణాలను చేపడతారు. ఈ నిధులతో ఇప్పటికే మున్సిపాలిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడతామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
