ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో..సెప్టెంబర్ 22న చలో హైదరాబాద్.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ (టి యు సి ఐ) ఆధ్వర్యంలో కేజీ బీవీ హాస్టల్ వర్కర్స్ సమస్యలపై ఛలో హైదరాబాద్ సెప్టెంబర్ 22న ఉద్యోగ భద్రత కల్పించాలని , పిఎఫ్ ఈఎస్ఐ గ్రాటివీటి చట్టాలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని విద్యార్థుల సంఖ్య కనుగుణంగా వర్కర్ల ఉద్యోగుల సంఖ్య పెంచాలని డిమాండ్తో చలో హైదరాబాద్ కార్యక్రమానికి అధికంగా కదిలి రావాలని చారకొండ, వంగూరు, వెల్దండ, ఊరకుండా,కల్వకుర్తి హాస్టల్లో కరపత్రల పోస్టర్ ద్వారా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా నాయకులు ఆంజనేయులు, పద్మ, శ్రీలత,బికినీ లక్ష్మి,జయ,శివ లీల తదితరులు పాల్గొన్నారు.