Hospitals
క్వాలిఫైడ్ డాక్టర్లను మరిపించేలా చర్ల మండలం ఆర్ఎంపిలు
ఒకప్పుడు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లే నేడు హాస్పిటల్సగా నిర్వహణ
వైద్యాధికారుల అనుమతులతోనే నడుస్తున్నాయా
నేటిదాత్రి చర్ల

చర్ల మండలం చతిస్గడ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతం కావడంతో అమాయకులైన ఆదివాసిలు నమ్మి ఆర్ఎంపీల వద్దకు వైద్యం కొరకు వెళ్లడంతో వారు ప్రధమ చికిత్స చేయవలసిన సదరు ఆర్ఎంపీలు స్టెరాయిడ్స హైడోస్ యాంటీబయటిక్లు ఇస్తున్నారు రక్త పరీక్షలు చేయిస్తూ మలేరియా డెంగ్యూ జ్వరాలకు కూడా వచ్చి రాని వైద్యం చేస్తున్నారు వ్యాధి ఎక్కువ అయిన తరువాత భద్రాచలం పంపిస్తూ కూడా లబ్ధి పొందుతున్నారు అక్కడకు వెళ్లి చివరి దశలో రోగులు ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు ఆర్ఎంపి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఇప్పుడు హాస్పిటల్ గా చలామణి అవుతున్నాయి ఎలా సాధ్యమని వివరాలు కోరితే మాకు ల్యాబ్‌లకు లైసెన్స్ ఉన్నాయని చెప్పడం గమనార్హం
ప్రక్కనే మెడికల్ షాపు డయాగ్నస్టిక్ సెంటర్లు ఎలా వచ్చాయి ఒకప్పుడు క్లినిక్ అని బోర్డు పెట్టడానికి భయపడే ఆర్ఎంపీలు ఇప్పుడు కొందరు హాస్పిటల్ గా ప్రభుత్వ అనుమతులతో బయో మెడికల్ మరియు డయాగ్నిక్ సెంటర్లకొరకు అడ్డదారిలో అనుమతి తీసుకుని భద్రాచలం లో ఉండే డాక్టర్లు పేర్లతో బోర్డులు తగిలించుకొని వైద్యశాలలు నడుపుతున్నారు డిఎంఎల్ టి క్వాలిఫికేషన్ ఉన్నవారికి కూడా ల్యాబ్ పర్మిషన్ లేదు ఎందుకంటే వారు ఆర్ఎంపీలకు మరియు సెల్ఫ్ గా టెస్టులు చేస్తూ వైద్యం చేస్తున్నారని వారిని నియంత్రణ చేయాలన్న ఉద్దేశంతో మినిమం ఎంబీబీఎస్ అర్హత ఉన్న వారి వద్దే ల్యాబ్ ఉండాలన్న రూల్స్ అమల్లో ఉన్నాయి కానీ ఆర్ఎంపీల డయాగ్నస్టిక్స్ సెంటర్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారు అర్థం కాని పరిస్థితి వారి ల్యాబ్‌లో కనీస అర్హత కలిగిన టెక్నీషియన్స్ కూడా లేకుండానే కొందరైతే ఆర్ఎంపీలే రక్త పరీక్షలు చేస్తున్నారు మండలంలోని చిన్న గ్రామాలు తెగడ సత్యనారాయణపురం ఆర్ కొత్తగూడెం లో కూడా ఆర్ఎంపీలు ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు ఒక ల్యాబ్‌లో రిపోర్టు మరో ల్యాబ్ రిపోర్టుకి సంబంధం లేకుండా ఇస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా వీరి మధ్య పోటీ పెరగడంతో మా వద్ద రక్త పరీక్షలకు తక్కువ ధరలు అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు ఇకనైనా అధికారులు స్పందించి నకిలీ వైద్యులను గుర్తించి వారి మీద చర్యలుతీసుకోవాల్సిందిగా చర్ల మండల ప్రజలు కోరుకుంటున్నారు
