
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 27, నేటిధాత్రి:
ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణం కాకాతీయ కాలనీలో నివాసం ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన భారతి భీమక్క విధ్యాధర్ ల కుమార్తె నీలవేణీ వివాహానికి దాతలు ఇచ్చిన 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ తవక్కల్ విధ్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి ప్రధాన కార్యదర్శి జంగపల్లి మల్లయ్య ,యువ నాయకులు బింగి శివకిరణ్ కనక రాజు ,కళ్యాణ్, ఆర్నె సతీష్ ,గిర్ని మల్లేష్ తదితరులు సత్యపాల్గొన్నారు…