గ్రామాలలో గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
డిఎంహెచ్ఓ అనిత
మంచిర్యాల నేటి,ధాత్రి :
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, చేసుకోవాలని ప్రోత్సహించినా కఠినచర్యలు తప్పవని డీఎంహెచ్‌వో అనిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో జిల్లాస్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో 45 స్కానింగ్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయని, 12 ఆసుపత్రు లు రెన్యువల్ కోసం, 2 ఆసుపత్రులు కొత్తగా స్కా నింగ్ సెంటర్ల మంజూరుకు నమోదు చేసుకోగా వివరాలను పరిశీలించి సర్టిఫికెట్ మంజూరుకు ఉన్నతాధికారులకు పంపించామని తెలిపారు. కళాశాలలో, శిక్షణ కేంద్రాల్లో దిశ కార్యక్రమాల్లో గ్రామపంచాయతీలో గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పుట్టబోయేది ఆడ, మగబిడ్డ అని అడగడం చట్టరీత్యా నేరమని తెలిసే విధంగా స్కానింగ్ సెంటర్లలో పోస్టర్లు ప్రదర్శించాలని తెలి పారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడిన వారికి 3 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తామనే అవ గాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘన చర్యలకు పాల్పడినట్లయితే 104 కు ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం లింగ నిర్ధారణ పరీక్షల నిషేధానికి సంబంధించి గోడ ప్రతులను నోడల్ అధికారి నీరజ, వైద్యులు రాధిక, కోటేశ్వర్‌రావు, సుధాకర్, రాజ్‌కిరణ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.