సర్వే డేటా ఎంట్రీ చేసిన ఉద్యోగులకు పారితోషికం ఇప్పించండి
ఎంపీడీవో కు వినతి పత్రం అందజేసిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఉద్యోగులు, డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లు
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి:
2024 నవంబర్ నెలలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో విధులు నిర్వహించిన ఎన్యూమరేటర్లకు మరియు డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లకు ఇవ్వవలసిన పారితోషికం వెంటనే ఇవ్వాలని కేసముద్రం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి కి సోమవారం ఉద్యోగులు మరియు ఆపరేటర్లు వినతి పత్రం సమర్పించడం జరిగింది. విధులు నిర్వహించి మూడు నెలలు గడిచినా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని, సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని విధులు నిర్వహించిన ఉద్యోగులందరికీ మరియు డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లందరికీ డబ్బులు వెంటనే ఇప్పించాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖాదర్, వెన్ను బిక్షపతి, పత్తిపాక ఉపేందర్, వి వెంకటరమణ, చీర మురళి, బండారు స్వాతి, నేలకొండ నాగవాణి, బానోత్ దేవుసింగ్, ఏ ప్రణీత, ఎస్ అనిత, నేరెళ్ల పద్మ, జి రేవంత్, జి రాజు, జి జస్వంత్, షేక్ అజిత్ లు పాల్గొన్నారు.