లైఫ్ ఈస్ లైక్ ఎ ఫుట్ బోల్.. ఎవ్రీ వన్ మస్ట్ రీచ్ ద గోల్!
యూత్ తో ఆట.. పొలిటికల్ వేట ‘‘రేవంత్ రెడ్డి’’ శకం.

`ఫిట్ నెస్ ఫస్ట్.. గోల్ ఈస్ నెక్స్ట్!
`యూత్ కు ‘‘సిఎం రేవంత్ రెడ్డి’’ సందేశం.

`హెల్త్, వెల్త్ స్టేట్ గా తెలంగాణా నిర్మాణం.
`స్పోర్ట్స్ లో నెంబర్ వన్ తెలంగాణా.

`అంతరించి పోతున్న క్రీడలకు తెలంగాణా పునరుజ్జీవం.
`ప్రతి వ్యక్తిలో క్రీడా స్ఫూర్తి నింపడమే ‘‘రేవంత్ రెడ్డి’’ లక్ష్యం.
`గెలుపోటములను ఎదుర్కునే దైర్యం యువతలో నింపడమే ‘‘రేవంత్’’ ఆశయం.
`తెలంగాణా యువత అన్నిరంగాలలో రాణించడమే ‘‘రేవంత్’’ ప్రణాళిక.
`అగ్రరాజ్యలన్నీ క్రీడలలో మెటిగా వున్నాయి.
`ప్రపంచంలో ప్రగతిలో పోటీపడే దేశాలన్నీ క్రీడలలో రాణించాయి.
`ఒక దేశ పురోగతిని ఆవిష్కరించేవే క్రీడలు.
`ప్రపంచ దేశాలన్నీ ఒక దేశం వైపు చూడాలంటే క్రీడాలే మార్గం.
`క్రీడలతోనే టూరిజం అభివృద్ధికి అలవాలం.
`ప్రపంచంలోనే అత్యధికంగా అభిమానించే అట పుడ్ బోల్.
`హైదరాబాద్ విశ్వ నగరంగా వెలుగొందాలంటే స్పోర్ట్స్ సిటీ కావాలి.
`అందుకే తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు.
`తెలంగాణా యువతను క్రీడాకారులుగా తీర్చిదిద్ధుతున్నారు.
`అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సితో రేవంత్ పోటీకి సిద్దమౌతున్నారు.
`తెలంగాణ యూత్ లో జోష్ నింపుతున్నారు.
`ప్రపంచమంతా తెలంగాణా వైపు చూసేలా చేస్తున్నారు.
`సీఎంగా క్రీడా రంగానికి ఊపు తీసుకొస్తున్నారు.
`అంతర్జాతీయ క్రీడాకారులతో ఆడిన తొలి సిఎం గా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు
`లైఫ్ గోల్ రిచ్ అయిన సిఎం రేవంత్ రెడ్డి.
`ఈ వయసులో కూడా ఫిట్ మాన్, బ్రైట్, బ్రేవ్ లీడర్ అని నిరూపించుకుంటున్నారు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నేటిధాత్రి:
జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక గోల్ వుంటుంది. సాధనమున పనులు సమకూరుదరలోన అని వేమన చెప్పిన అక్షర సత్యాన్ని నిజం చేసిన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ప్రతి ఒక్కరు కలగనండి. ఆ కల నిజం చేసుకోండి అని అబ్దుల్ కలాం చెప్పిన మాటను నిజం చేసిన నాయకుడు సిఎం. రేవంత్ రెడ్డి. ఎందుకంటే చదువుకునే సమయంలోనే ఆయన ఒక గోల్ నిర్ధేశించుకున్నారు. సహజంగా ఆయన పుట్ బాల్ క్రీడాకారుడు. తను ఆడే ఆటలో గోల్ ఎలా కొట్టాలో నేర్చుకున్నాడు. జీవితంలో నిర్ధేశించుకున్న గోల్ఎలా రీచ్ కావాలో విశ్వ ప్రయత్నం చేశారు. అందుకే తెలంగాణకు సిఎం. అయ్యారు. నిజంగా ఇది ఒక కలే. ఆయన కలగన్న రోజులు వేరు. ఆ కల నెరవేరిన రోజులు వేరు. ఆయన కలగన్న రోజుల్లో ఆయన కల నిజమయ్యే పరిస్దితులు లేవు. కాని ఆయన తన కల నిజం చేసుకోవాలనుకున్నారు. అదెలా సాధ్యమని ఆలోచించ లేదు. ఎలా సాద్యం కాదో చూద్దాం అనుకున్నారు. అదీ పట్టుదల అంటే. అందుకే సిఎం. రేవంత్ రెడ్డి ఏ పని తలపెట్టినా పట్టుదలతో చేస్తారు. ఆ పనిని పట్టు విడవకుండా పూర్తి చేస్తారు. పట్టుదలకు మారుపేరుగా మారిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో సిఎం. రేవంత్ రెడ్డి కన్న కల కలగా మిగలకుండా నిజం చేసుకున్న ఏకైక నాయకుడు. తాను భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. ఒక్కో మెట్టు ఎక్కారు. ఆ మెట్లను తనకు అనుకూలంగా మల్చుకుంటూ ఎక్కారు. రాజకీయాల్లో కష్టపడి ఎదగడమొక్కటే దారి కాదు, విజ్ఞతతో, వివేకంతో, వ్యూహంతో ఎదగాలి. అందరినీ దాటేసుకుంటూ వెళ్లాలి. అది పరుగు పందెం కాదు. కాని రణరంగం. అలాంటి రణరంగాన్ని అవలీలగా ఎదుర్కొంటూ ఎదిగిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే లైఫ్ ఈస్ ఏ బాల్. ఎవ్రీ వన్ చూజ్ ఏ గోల్ అనే పదానికి రేవంత్ రెడ్డి నిర్వచనమయ్యారు. లైఫ్ ఈస్ లైక్ ఏ పుట్ బాల్. ఎవ్రీ వన్ మస్ట్ రీచ్ ద గోల్ అనే విజయానికి నిదర్శనమయ్యారు. తాను సాదించిన విజయాన్ని తెలంగాణ సాదించానులనుకుంటున్నారు. తెలంగాణ అన్ని రంగాలలో ముందుండాలని ఆశిస్తున్నారు. తెలంగాణ రేపటి సమాజం దేశానికి ఆదర్శం కావాలనుకుంటున్నారు. ప్రపంచ స్దాయిలో తెలంగాణ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. ఆశను నిజం చేసేందుకు అనేక రకాల కార్యక్రమాలు ఇప్పటికే చేపడుతున్నారు. అందులో భాగమైన క్రీడలకు అత్యంత ప్రాదాన్యతినిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. కొన్ని వేల మంది విభిన్న మైన రంగాలైన క్రీడల్లో నిష్టాతులను చేస్తున్నారు. అన్ని రకాల క్రీడల్లో గెలిచి, నిలిచే చాంపియన్లను తయారు చేస్తున్నారు. అందుకు తానే స్పూర్తి నింపుతున్నారు. ఓవైపు తెలంగాణ పురోగతి, మరో వైపు హైదరాబాద్ బ్రాండ్ పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆరోగ్యమే మహాబాగ్యమనే సూత్రాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందించే బృహత సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వయసు తేడా లేకుండా తెలంగాణ ప్రజలంతా చురుగ్గా చలాకీగా ఆరోగ్యంగా వుండేందుకు పర్యావరణ పరిరక్షణ చేపడుతున్నారు. ఈ వయసులో కూడా తాను వున్న ఆరోగ్య రహాస్యాన్ని నేటి యువతకు వివరిస్తున్నారు. అందుకే పుట్ బాల్ ఆటలో వున్న ఆరోగ్య సూత్రాన్ని, ఆటలో వున్న మెలకువలను నేర్పిస్తున్నారు. మన దేశ జాతీయ క్రీడ అయిన హాకీకి, ప్రపంచమంతా మెచ్చే పుడ్ బాల్‌కు అనేక రకాల పోలికలున్నాయి. సారూప్యతలు కనిపిస్తాయి. ప్రతి వ్యక్తికి ఒక గోల్ వున్నట్లే అటు హకీ, ఇటు పుట్ బాల్లో కూడా ఒక గోల్ వుంటుంది. ఆ గోల్ కొడితే ఆ జట్టు విజయం సాదిస్తుంది. ఆ క్రీడాకారుడు విజేత అవుతాడు. ఇది మౌలిక సూత్రమే కాదు. ఆమోదయోగ్యమైన ఆచరణకు నిదర్శనం. అందుకే తెలంగాణ యువత చదవుతో పాటు , క్రీడల ద్వారా అంతర్జాతీయఖ్యాతిని తెలంగాణకు తెచ్చేలా తయారు చేస్తున్నారు. తాను సిఎంగా వుండి కూడా పుట్ బాల్ ఆడి యువతలో స్పూర్తిని నింపుతున్నారు. ఈ నెల 13న పుట్ బాల్ అంతర్జాతీయ ఆటగాడు మెస్సీతో కలిసి పుట్ బాల్ అడేలా ఎగ్జిబిషన్ షోను రూపొందించారు. తెలంగాణలో వున్న క్రీడా పాఠశాలల నుంచి పుట్ బాల్ ఆటగాళ్లతో కలిసి, అంతర్జాతీయ పుట్‌బాల్ ఆటగాడు మెస్సీ జట్టుతో తలపడనున్నాడు. ఇది నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమనే చెప్పాలి. గతంలో ప్రపంచంలోనే కాదు, మన దేశంలో కూడా ఏ సిఎం. చేయని సాహసం చేస్తున్నారు. క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. అంతర్జాతీయ స్దాయి ఆటగాడు మెస్సీతో కలిసి ఆట విడుపు ఆట కాకుండా పట్టుదలతో గెలిచేలా నిజమైన ఆటను ఆడేందుకు సిఎం. రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్‌లో సిఎం. రేవంత్ దూకుడు చూసి, యువకులైన ఎంతో మంది క్రీడాకారులు ఆశ్చర్యపోతున్నారు. ఆయనతోపాటు వేగాన్ని అందుకోలేకపోతున్నారు. చిరుత పులిలా ఆయన దూసుకుపోతుంటే క్రీడాకారులు పులకించిపోతున్నారు. క్రీడాకారులకన్నా వేగంగా మైదానంలో కదులుతూ, బాల్‌ను ఆపే తీరు, గోల్ కొట్టే తీరును చూసి ఆశ్చర్యచకితులైతున్నారు. ఆయనతో పాటు ప్రాక్టీస్‌లో పాలుపంచుకుంటున్న క్రీడాకారులంతా నవయువకులు.. సిఎం. రేవంత్ రెడ్డి వారి వయసు రెట్టింపు వయసున్న వారు. అయినా వారితో పోటీ పడి ఆడడాన్ని చూసి ఆయన జట్టు సభ్యులంతా స్పూర్తిని పొందుతున్నారు. ఎలాగైనా ఈనెల 13న ఉప్పల్‌లో జరిగే పుట్ బాల్ ఆటలో గెలవాలన్న కసిని మిగతా ఆటగాళ్లు పెంచుకుంటున్నారు. ఒక వేళ ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లో ఆర్ఆర్9 బ్యాచ్( రేవంత్ రెడ్డి 9 బ్యాచ్) గెలిస్తే కూడా అదొక చరిత్రగానే మిగిలిపోతుంది. ప్రపంచంలో అగ్ర రాజ్యాలన్నీ పుట్‌బాల్‌ను ఎంతో ఆసక్తిగా ఆడతాయి. తిలకిస్తాయి. ప్రోత్సహిస్తాయి. క్రికెట్ అనేది కొన్నిదేశాలకే పరిమితం. కాని పుట్ బాల్ అనేది ప్రపంచంలోని అనేక దేశాలలో కనిపిస్తుంది. అందుకే సాకర్ కప్ క్రీడలంటే ప్రపంచమంతా కళ్లప్పగించుకొని చూస్తుంది. ఆ మ్యాచ్‌లను చూసేందుకు ప్రపంచం నలు మూలల నుంచి లక్షలాది మంది వెళ్తుంటారు. టివీలలో కొన్ని కోట్ల మంది వీక్షిస్తుంటారు. క్రీడాకారులు గోల్కొడుతుంటే తామే గోల్ కొట్టినంత సంబరపడిపోతారు. ఆనందం పడుతుంటారు. అదీ పుట్‌బాల్‌లో వుండే గొప్పదనం. అయితే మనిషి జీవితానికి పుట్ బాల్ ఆటకు ఎంతో సాన్నిహిత్యం వుంటుంది. ప్రతి వ్యక్తి వారి వారి జీవితంలో ఏదో లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అలా ప్రయత్నం చేసిన వారందరూ ఒకే సారి తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోలేరు. అనేక సార్లు ఓడిపోవచ్చు. కొన్ని సార్లు ప్రయత్న లోపంలోనే ఆగిపోవచ్చు. అయినా సరే గోల్ కొట్టేదాకా విశ్రమించకూడదన్న నిజాన్ని గుర్తుచేసేదే పుట్ బాల్. ఆట చివరి వరకు ఆడి గోల్ కొట్టాలన్న కసి వారిలో ఎలా వుంటుందో జీవితంలో ఏదో సాదించాలనుకున్న వారిలో కూడా ఆ స్పూర్తిని నింపేది పుట్ బాల్ ఆట. అందుకే ఆ ఆటకు అంత క్రేజ్. ఆ ఆటగాడైన మన సిఎం. రాజకీయాల్లో గోల్ కొట్టి విజయం సాధించడం అనేది గొప్ప విషయం. ఓడిన ప్రతిసారి గెలుపు కోసం ప్రయత్నం చేయడమే క్రీడా స్పూర్తి. అది రాజకీయాలకు వర్తింపజేసుకొని తన లక్ష్య సిద్దిని చేదించిన ఏకైక నాయకుడు సిఎం. రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి సిఎంగా తెలంగాణను క్రీడల్లో అంతర్జాతీయ స్దాయిలో నిలబెట్టాలనుకుంటున్నారు. ఈనెల 13న మెస్సీతో తలపడనున్నారు. ప్రపంచమంతా తన వైపు చూసేలా సిఎం. రేవంత్ రెడ్డి పుట్ బాల్ ఆడుతున్నారు. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి, విజయాన్ని తన ఖాతాలో వేసుకొవాలని నేటిధాత్రి దిన పత్రిక ఆకాంక్షిస్తోంది.
