ఆరోగ్య సంక్షేమం అనేవి సుస్థిరాభివృద్ధికి అత్యంత కీలకం. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 3వదిగా ఆరోగ్యరాసంక్షేమం వున్నాయి. మనుషులు ఆరోగ్యంగా వుంటేనే ఉత్పత్తిలో భాగస్వాములై ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తారు. ఈ నేపథ్యంలోనే అన్ని వయస్సుల వారికి సంపూర్ణ ఆరోగ్య సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాదు, ఇందుకు అవసరమైన పథకాలను అమలు చేస్తోంది. ఆరోగ్యంతో వున్నవారు పనుల్లో ఉత్సాహంగా పాల్గనడంవల్ల పేదరికం తగ్గిపోతుంది. దీన్ని దృష్టిలో వుంచుకొనే రేవంత్ ప్రభుత్వం పేదవర్గాలకు అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పటివరకు అమలుపరుస్తున్న రూ.5లక్షల పరిమితిని రూ.10లక్షలకు పెంచింది. ఇదేసమయంలో రాష్ట్రంలో ఆరోగ్య పరిరక్షణ సదుపాయాలను మరింతగా విస్తరిస్తోంది. వీటిద్వారా సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధుల వ్యాప్తిని అరికట్టడమే కాకుండా మా తాశిశు సంక్షే మం, శిశుమరణాలు, ప్రసూతి మరణాలను కనిష్టస్థాయికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇదే సమయంలో ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వందృష్టిపెట్టింది. ముఖ్యంగా నివారక మందులు, సమీకృత ఆరోగ్యసేవలు అందుబాటులోకి తీసుకొని రావడం ద్వారా రాష్ట్రంలో స్థితిస్థాపక ఆరోగ్య పరిరక్షణ సేవలను అందించడానికి అన్నిరకాలచర్యలు తీసుకుంటోంది.
తెలంగాణలో ప్రస్తుతం ప్రసూతి మరణాలు ప్రతి లక్షకు 43గా కొనసాగుతున్నాయి. ఇది జాతీ య సగటుతో 97తో పోలిస్తే సంగం కంటే తక్కువ. ఇక శిశుమరణాలు కూడా రాష్ట్రం జాతీయ సగటుకంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. తెలంగాణలో ప్రతి వెయ్యి జననాలకు 21మరణాలు సంభవిస్తుండగా, జాతీయ సగటు 28గా నమోదైంది. ఇక ఐదేళ్ల లోపు వయస్కులైన శిశు మరణాల విషయంలో జాతీయ సగటు 32కాగా తెలంగాణలో 23గా వుంది. అదేవిధంగా నెలలోపు వయస్కులైన శిశు మరణాల విషయంలో జాతీయ సగటు ప్రతి వెయ్యికి 20 కాగా, తెలగాణలో 15గా నమోదైంది. పై సూచికలను పరిశీలించినప్పుడు ఆరోగ్యాసంక్షేమ రంగాల్లో జాతీయ స్థాయితో పోలిస్తే, తెలంగాణ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నదనే చెప్పాలి. ఇదేసమయంలో జాతీయస్థాయి ప్రజననసామర్థ్యం (ఫెర్టిలిటీ) 2.0తో పోల్చినప్పుడు తెలంగాణలో తక్కువగా అంటే 1.5గా నమోదైంది. అంటే రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయన్నది స్పష్టమవుతోంది. అదేవిధంగా తెలంగాణలో ఆసుపత్రిలో కాన్పులు నూటికి 97% జరుగుతుండగా, జాతీయస్థాయిలో ఇది 88%గా నమోదైంది. ఈ గణాంకాలు ఆరో గ్యాసంక్షేమ రంగంలో తెలంగాణ పనితీరు బాగా వున్నదన్న సత్యాన్ని వెల్లడిస్తున్నాయి.
ఆరోగ్య మౌలిక సదుపాయాలు
భౌతిక సదుపాయాలు:
ప్రజలకు మంచి ఆరోగ్య సేవలందించడానికి, ఉత్తమమైన మౌలిక సదుపాయాలు అందుబాటు తప్పనిసరి. తల్లుల మరియు శిశువుల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం వంటి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా అమలుచేస్తోంది. రాష్ట్రంలో ఆరో గ్య సేవలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన వివిధ సదుపాయాలు సమర్థవంతంగా సేవలందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం జిల్లా ఆసుపత్రులు`2, బోధనాసుపత్రులు`26, ఏరి యా ఆసుపత్రులు`72, ఇ.ఎస్.ఐ. ఆసుపత్రులు`4, డయాగ్నస్టిక్ సెంటర్లు`2, ప్రత్యేక చికిత్సలనిమిత్తం పనిచేస్తున్న ఆసుపత్రులు`14, సామాజిక ఆరోగ్య కేంద్రాలు`97, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు`636, పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు`246, డిస్పెన్సరీలు`75, ఆరోగ్య`ఉపకేంద్రాలు`4745, ప్యానల్ క్లినిక్‌లు`20, బస్తీ దవాఖానాలు`462, అన్ని కలిపి 6401 పనిచేస్తున్నాయి. వీటిల్లో 8072మంది డాక్టర్లు ప్రస్తుతం పనిచేస్తుండగా, 12484 పడకలు అందు బాటులో వున్నాయి.
ప్రజారోగ్యం మరియు కుటుంబసంక్షేమ శాఖ రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి గత జూన్ నెలలో నోటిఫికేషన్ జారీచేసింది. వీటిల్లో 431 పోస్టులు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్‌ఎడ్యుకేషన్‌కు 4 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ (ఐపీఎం)కు కేటాయించారు. బీబీనగర్‌లో నిర్మించిన అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ రాష్ట్ర ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలను సూపర్‌స్పె షాలిటీ స్థాయిలో అందజేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌మెడికల్ సైన్సెస్ ఒకప్పుడు ఎముకల ఆసుపత్రిగా వుండేది. 1962లో 246 పడకల సౌకర్యంతో దీన్ని ప్రభుత్వం నెలకొల్పింది. తర్వాత కాలక్రమేణా దీన్ని బాగా అభివృద్ధిచేసి, పరిశోధన, వైద్యవిద్య రంగంలో ప్రతిష్టాత్మక సంస్థగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఇప్పుడు ఇందులో 37 విభాగాల తో 1639 పడకల సదుపాయంతో నిత్యం ఎంతోమందికి వైద్యసదుపాయం అందిస్తోంది. ఇక్కడరోజూ 3500మంది ఔట్‌పేషెట్లకు వైద్యపరీక్షలు అందుతున్నాయి. ప్రస్తుతం ఇది 30 పెరినియల్ డయాలసిస్ కేంద్రాలకు నోడల్ సంస్థగా పనిచేస్తోంది. 2023లో నిమ్స్‌లో రికార్డుస్థాయిలో రోగుల పరీక్షలు జరిగాయి. ఇదే ఏడాది ఈ ఆసుపత్రి ఆదాయం 29.8% వృద్ధి చెంది రూ.338.94కోట్లు వార్షిక ఆదాయాన్ని పొందింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్స్ అభివృద్ధికి కోసం గ్రాంట్ల రూపంలో నిధులు మంజూరు చేసింది. ఈ మొత్తాలతో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డీఎస్‌ఏ, ఐజీటీ సదుపాయం, కార్డియో థొరాకిక్ ఐ.సి.యు, క్రిటికల్ కేర్‌కు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిమ్యులేషన్ సెంటర్ వంటి సదుపాయాలను కల్పించారు. ఆర్థిక, సాంకేతిక, వర్క్‌ఫోర్స్‌ల సహాయంతో పేషెంట్లకు మరింత నాణ్యమైన సేవలందించడానికి నిమ్స్ కృషి చేస్తోంది.
హైదరాబాద్‌లో మరో ప్రధానమైన ఆరోగ్యకేంద్రం ది తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సై న్స్ రీసెర్చ్ (టిమ్స్), ఆధునిక వైద్య చికిత్స మరియు విద్యను అందిస్తోంది. ఇందులో 1261 పడకల సదుపాయం కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి మరో మూడు ఆసుపత్రులను హైదరాబాద్‌లో నెలకొల్పాలన్న యోచనలో వుంది. ఇవి టిమ్స్‌కు ప్రతిక్రృతిగా వుండటమే కా కుండా, అత్యాధునిక వైద్యసదుపాయాలతో పాటు వైద్యవిద్యను అందించేవిగా వుంటాయి.
మెహదీ నవాజ్ జంగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ (ఎంఎన్‌జే) తెలంగాణలోని మరో ప్రధానమైన వైద్యసంస్థ. దారిద్య్రరేఖకు దిగువన వున్న ప్రజలకు ఇందులో ఉచిత కేన్సర్ పరీక్షలు, చికిత్స అందిస్తున్నారు.450 పడకల సదుపాయమున్న ఈ ఆసుపత్రిలో బోధనాసదుపాయం కూడా అందుబాటులో వుంది. వార్షికంగా 10వేల మంది రోగులు ఈ ఆసుపత్రిలో నమోదవుతున్నారు. ఈ ఆసుపత్రిలో నిత్యం 400మంది రోగులకు రేడియోథెరపీ, 350మందికి కీమోథెరపీ అందించేందుకు సదుపాయాలున్నాయి. ఈ ఆసుపత్రిలో ఏటా లక్షన్నర కేన్సర్‌కు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ 500 నుంచి 550 మంది ఇన్‌పేషెంట్లు ఈ ఆసుపత్రిలో స్థిరంగా చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక మరియు ఒరిస్సాలనుంచి కూడా రోగులు ఇక్కడకు మెడికల్ టూరిజం కింద వస్తుంటారు.
2016లో ఏర్పాటైన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) రాష్ట్రంలో వైద్య సదుపాయాల విస్తరణకు ఎంతగానో దోహదపడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 175 టీవీవీపీ ఆసుపత్రులు పనిచే స్తుండగా వీటి మొత్తం పడకల సామర్థ్యం 11960. డయాలసిస్, ఐ.సి.యు, డీఎడిక్షన్ సెంటర్లువంటి సదుపాయాలు వీటిల్లో కల్పించడం వల్ల, నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నా యి. అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రాథమిక వైద్యసదుపాయాలను కల్పించడం ద్వారా మతా,శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి వీలవుతోంది. రాష్ట్రంలోని ఏ టీవీవీపీ ఆసు పత్రిని తీసుకున్నా వాటిల్లో మహిళలు 52% ఇన్‌పేషెంట్లుగా, 50% ఔట్‌పేషెంట్లుగా చికిత్స పొందడం కనిపిస్తుంది. అదేవిధంగా 37% పురుషులు ఇన్‌పేషెంట్లు, 39% ఔట్ పేషెంట్లుగాచికిత్స పొందుతున్నారు. ఇదేసమయంలో 14సంవత్సరాల లోపు వయస్కులైన పిల్లలు 11%వరకు ఇన్‌పేషెంట్లు, ఔట్‌పేషెంట్లుగా వీటిల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రులో మరింత నాణ్యమైన చికిత్సను అందించేందుకు వీలుగా వైద్యవిధాన పరిషత్ అవసరమైన బడ్జెట్‌ను మరింతగా పెంచింది. వీటితో ఆధునిక సదుపాయాలతో పాటు మందులను కూడా రోగులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రోగుల సంతృప్తే లక్ష్యంగా ఈ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. 2023`24 సంవత్సరంలో తల్లుల, పిల్లల సంక్షేమం మరియు మల్టీ స్పెషాలిటీ సంరక్షణ సదుపా యాల విషయంలో ఈ ఆసుపత్రులు కీలకపాత్ర పోషించాయి. ప్రస్తుతం టీవీవీపీ ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్లు, ఇన్‌పేషెట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఈ ఆసుపత్రుల్లో ప్రస వాల సంఖ్య, డయాలసిస్ పేషెంట్ల సంఖ్య బాగా పెరగ్గా, సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. గత ఆరునెలల కాలంలో ఈ ఆసుపత్రుల్లో చికిత్సలు, రోగనిర్ధారణ పరీక్షలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పోలి స్తే వీటిల్లో ఖర్చు చాలా తక్కువ కావడంతో అత్యధికశాతం రోగులు ఇక్కడే తమకు అవసరమైన సేవలు పొందుతున్నారు.
వైద్యవిద్య
అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు సూపర్‌స్పెషాలిటీ వైద్యవిద్యార్థులకు నాణ్యమైనవైద్యవిద్యను అందించేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఏఈ) బాధ్యత వహిస్తుంది. డీఏఈ కింద రాష్ట్రంలో 26 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, 3690 మెడికల్ సీట్లు, 1144 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు, 104 సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులో వున్నాయి. ఔట్ పేషెంట్లు, ఇన్‌పేషెంట్లు, లేబరెటరీ, ఫోరెన్సిక్, అవయవాల మార్పిడి, క్యాథ్ ల్యాబ్‌లు, ఆధునిక రోగనిర్ధారణ పరీక్షలు వంటి సమీకృత వైద్యసేవలను డీఏఈ అందిస్తోంది.
ఈ మెడికల్ కళాశాలలతో పాటు హైదరాబాద్‌లో ఒక డెంటల్ కళాశాల మరియు ఆసుపత్రి పనిచేస్తున్నాయి. ఇందులో 100మంది గ్రాడ్యుయేట్లు, 27మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు డెంటల్ విద్యను అభ్యసిస్తున్నారు.
ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 28 నర్సింగ్ కళాశాలలు పనిచేస్తున్నాయి. కాగా వికారాబాద్ జిల్లా కొండగల్‌లో ఒక డెంటల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం 2024లో పాలనాపరమైన అనుమతిని మంజూరుచేసింది. ఈ కళాశాలలో 2024`25 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి.
డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో నెలకొన్న 26 బోధనాసుపత్రుల నిర్వహణను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చూస్తుంది. వీటిల్లో 12,484 పడకలు అందుబాటులో వున్నాయి. ఈ సుపత్రుల్లో ఔట్‌పేషెంట్, ఇన్‌పేషేంట్ సేవలు, లేబరేటరీ పరీక్షలు, ఫోరెన్సిక్ మెడిసిన్, క్యాథ్ ల్యాబ్ సర్వీసులు, సీటీ మరియు ఎమ్మారై స్కానింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. దీర్ఘకాల కిడ్నీ వ్యాధిపీడితులకోసం డయాలసిస్ సేవలు కూడా ఈ టీచింగ్ ఆసుపత్రుల్లో అందుబాటులో వున్నాయి.
రాష్ట్రంలో అవయవాల మార్పిడిని రెండువిధాలుగా చేపడుతున్నారు. మొదటిది మరణించిన వారిఅవయవాల మార్పిడి కాగా రెండవది లైవ్ మార్పిడి. ఈ అవయవ మార్పిడులు అత్యంత ఖర్చు తో కూడుకున్నవి కావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులను భరించడం సామాన్యులకు కష్టసా ధ్యం. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడికి సంబంధించిన అత్యాధునిక యూనిట్‌ను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి ఆదనంగా ఫెర్టిలిటీ కేంద్రాలను మూడు ఆసుపత్రుల్లో ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఆసుపత్రులు వరుసగా గాంధీ ఆసుపత్రి (సికింద్రాబాద్), ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి-పెట్లబుర్జ్ మరియు ఎంజీఎం ఆసుపత్రి`వరంగల్‌లో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరో ఎనిమిది మెడికల్ కళాశాలలకు అనుమతినిచ్చింది. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఈ కళాశాలలను ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, యాదా ద్రి భోనగిర్, రంగారెడ్డి, మేడ్చెల్`మల్కాజ్‌గిరి, వరంగల్ మరియు మెదక్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తా రు. ఒక్కొక్క ఆసుపత్రిలో 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించి, ప్రతి కళాశాలో 433 పోస్టుల ను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈవిధంగా ఈ మొత్తం కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు, 3464 పోస్టులు అందుబాటులోకి వస్తాయి. 2025`26 ఆర్థిక సంవత్సరానికి కొండగల్‌లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఇక్కడ కూడా వార్షికంగా 50 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
తెలంగాణ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంది. ఔషధాలు, మందులు, సర్జరీలకు కావలసిన మెటీరియల్, క్లాంతింగ్, టెంటేజ్, స్టోర్సు, డయాగ్నస్టిక్ రీయేజెంట్లు, వైద్య పరికరాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఎప్పటికప్పుడు సరఫరా చేయడం ఈ సంస్థ బాధ్యత. ఇది ఆరోగ్యం, వైద్యం మరియు కు టుంబ సంక్షేమ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది.
ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి (ఆయుష్)
నేషనల్ ఆయుష్ మిషన్ సమన్వయంతో ప్రభుత్వం ఆయుష్ వైద్య వ్యవస్థలకు మద్దతివ్వడమే కాకుండా, ఆయుష్ డిస్పెన్సరీలు, ఆసుపత్రలను అప్‌గ్రేడ్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంది. ఆయుష్ సదుపాయాలున్న ప్రదేశాల్లో శుభ్రత, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ వంటి చర్యలను కాయకల్పకార్యక్రమం ప్రోత్సహిస్తుంది. ఆయుర్వేదం, యోగ తరహా చికిత్సలు మతాశిశు సంరక్షణ, తల్లుల, పిల్లల మరణాలను తగ్గించడానికి కృషి చేస్తుంది. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వైద్యవిధానాలకు అనుగుణంగా ఈ`ఔషధీ ఆన్‌లైన్ ఫార్మసీలు పనిచేస్తున్నాయి.