వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు తెలంగాణకు వెన్నెముక లాంటివి. ఎందుకంటే రా ష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజల్లో 65.15% మంది ముఖ్య జీవనాధారం వ్యవసా యం మాత్రమే. అదే రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే 47.34% శ్రామికశక్తి ప్రధానగా ఆధారపడేది ఈ రంగంపైనే. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలు నిజమైన రైతులకు మాత్రమే అందేవిధంగా చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం దాని అనుబంధ రంగాల మద్దతు స్థూల రాష్ట్ర చేర్చిన విలువ (జీఎస్‌వీఏ)లో 16`17శాతంగా కొనసాగుతోంది. 2022`23తో పోల్చినప్పుడు 2023`24లో వర్తమాన ధరల్లో జీఎస్‌వీఏలో ఈరంగం వాటా 1.2% తగ్గుదల నమోదుకావడం గమనార్హం. అంటే 17.0% నుంచి 15.8%కు పడిపోయింది. 2023లో రాష్ట్రంలోని ఋతుపవనాల రాక 17రోజులు ఆలస్యం కావడం, సీజన్ మొత్తంలో వర్షపాతంలో చోటుచేసుకున్న హెచ్చుతగ్గులు వ్యవసాయరంగ ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం చూపడం, జీఎస్‌వీఏలో ఈరంగం వాటా తగ్గిపోవడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా కందులు, పెసలు, మొక్కజన్న పంటలు దెబ్బతిన్నాయి. అంతేకాదు దీర్ఘకాలం వర్షాలు కురవకపోవడం, భూగర్భజలాల మట్టం, కృష్ణానదీ జలాలు తగ్గిపోవడం కూడా పరిస్థితిని మరింత దెబ్బతీసింది.
2022-23 మరియు 2023-24 మధ్యకాలంలో వర్తమానధరల్లో ప్రాథమిక రంగంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటాల్లో మార్పులు రావడం గమనార్హం. జీఎస్‌వీఏలో పంటల నిష్పత్తి 49.8% నుంచి 47.5%కు అంటే 2.3% మేర పడిపోవడానికి ప్రధాన కారణం వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులే. ఇదే సమయంలో పశుపోషణ 44.7% నుంచి 46.8%కు అంటే 2.3% పెరుగుదల నమోదు చేసింది. అంటే ఈరంగంలో రైతులు కొత్త పద్ధతులుఅవలంబించడం మరియు పెరుగుతున్న డిమాండ్ ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇదేకాలంలో అడవుల అభివృద్ధి 2.2%వద్ద స్థిరంగా వుండటం ఈరంగంలో కార్యకలాపాలు నిలకడగా కొనసాగుతున్న అంశాన్ని సూచిస్తుంది. ఇక మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్ రంగాలు 3.3% నుంచి 3.5% వృద్ధిని నమోదు చేశాయి. 2022ా23 సంవత్సరం సవరించిన తొలి అంచనాలు మరియు 2023ా24 ముందస్తు అంచనాల ప్రకారం మొత్తం వ్యవసాయ రంగంలో, పంటల వాటా 7.89% నుంచి ా0.39శాతం క్షీణించగా, పశువుల పెంపంకం 2.35% నుంచి 3.99%కు పెరగడం గమనార్హం. ఇక అటవీరంగం ా0.93% నుంచి 0.07%కు స్వల్ప వృద్ధిని న మోదు చేసింది. ఇదే సమయంలో మత్స్య పరిశ్రమ మరియు ఆక్వాకల్చర్ రంగాలు 0.44% నుంచి 0.36%కు స్వల్పంగా క్షీణించింది. మొత్తంమీద పరిశీలిస్తే పశుసంవర్థకంలో కొంత వృద్ధిచోటుచేసుకున్నప్పటికీ, పంట ఉత్పత్తులు తగ్గిపోవడం జీఎస్‌వీఏలో వ్యవసాయరంగం వాటా తగ్గిపోవడానికి ప్రధాన కారణం.
దేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రమైన తెలంగాణ విస్తీర్ణం 276.95లక్షల ఎకరాలు (112.08 లక్షల హెక్టార్లు). 2022-23లో రాష్ట్రంలో నికర విత్తిన విస్తీర్ణం 52.61% కాగా 24.70% అడవులు, 7.62% భూమిని వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగిస్తుండగా, 5.78% పడావు భూ ములు, 5.42% సాగుకు పనికిరాని భూమి వున్నాయి. ఇక మిగిలిన 3.87% భూములను పచ్చిక మైదానాలుగా, ఇతరత్రా చెట్ల పెంపంకానికి వినియోగించడం జరుగుతోంది.
2021ా22లో రాష్ట్రంలో చేపట్టిన వ్యవసాయ గణన ప్రకారం 70.60లక్షల కమతాలు ప్రస్తుతం సాగులో వున్నట్లు తేలింది. దీని మొత్తం విస్తీర్ణం 63.12లక్షల హెక్టార్లు. 4.94ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన కమతాలను సాగుచేసే రైతులను సన్నకారు, చిన్నకారు రైతులుగా వ్యవహరిస్తారు. వీరి ఆధీనంలో 91.4% భూములు సాగవుతున్నాయి. అంటే 43లక్షల హెక్టార్లు. మొ త్తం విస్తీర్ణంలో ఇది 68.2%. పాక్షికామధ్యతరహా, మధ్యతరహా, పెద్ద రైతుల ఆధీనంలో 7.1%, 1.4% మరియు 0.1% భూములు సాగవుతున్నాయి. అంటే మొత్తం విస్తీర్ణంలో 20.5%, 8.7% మరియు 2.6% భూములు వీరి ఆధీనంలో వున్నాయి. 2021ా22 వ్యవసాయ గణన ప్ర కారం రాష్ట్రంలో సగటు కమతం విస్తీర్ణం 0.89హెక్టార్లు. 2015ా16లో ఇది ఒక హెక్టారుగా వుండేది. 2015ా16 నుంచి 2021ా22 సంవత్సరాల మధ్యకాలంలో వ్యవసాయ కమతాల పంపిణీలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈ కాలంలో మొత్తం కమతాల సంఖ్య 59.48 లక్షల నుంచి 70.60 లక్షలకు పెరిగింది. సన్నకారు కమతాలు (2.47ఎకరాలు కంటే తక్కువ) 64.6% నుంచి 68.7% వరకు పెరగ్గా, చిన్న కమతాలు (2.48 నుంచి 4.94ఎకరాలు) 23.7% నుంచి 22.7%కు స్వల్పంగా తగ్గాయి. పాక్షికామధ్యతరహా కమతాలు (4.95ా9.88 ఎకరాలు) 9.5% నుంచి 7.1%కు, మధ్యతరహా కమతాల (9.89ా24.77 ఎకరాలు) విస్తీర్ణం 2.1% నుంచి 1.4%కు, పెద్ద కమతాలు (24.78 ఎకరాలకంటే ఎక్కువ విస్తీర్ణం) 0.2% నుంచి 0.1%కు తగ్గిపోయాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే క్రమంగా చిన్న కమతాల సంఖ్య ముఖ్యంగా సన్నకారు కమతాల సంఖ్య పెరుగుతూ రావడాన్ని గుర్తించవచ్చు.
ఇక షెడ్యూల్డు కులాలవారి ఆధీనంలో మొత్తం కమతాల్లో 13.9% వుండగా, ఇవి మొత్తం విస్తీ ర్ణంలో కేవలం 9.7% మాత్రమే. ఇక గిరిజనుల (ఎస్టీలు) ఆధీనంలో మొత్తం వ్యవసాయ కమ తాల్లో 11.8% వుండగా మొత్తం విస్తీర్ణంలో 11.9%. 74.3% శాతం భూకమతాలు ఇతరుల కు చెందినవి. మొత్తం విస్తీర్ణంలో 78.2%.
2015ా16 నుంచి 2021ా22 మధ్యకాలంలో వివిధ సామాజిక వర్గాల మధ్య భూకమతాల పంపిణీలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇదే కాలంలో ఎస్సీల కమతాలు 11.8% నుంచి13.9%కు పెరగ్గా, ఎస్టీవర్గాల ఆధీనంలోని కమతాలు 12% నుంచి 11.8%కు తగ్గడం గమ నార్హం. ఇక ఇతరుల కమతాల సంఖ్య ఇదే కాలంలో 76.2% నుంచి 74.3%కు తగ్గిపోవడం గమనార్హం.
తెలంగాణ వ్యాప్తంగా సగటు భూకమతాల విస్తీర్ణం ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉన్నది. స్థానికంగా అనుసరించే వ్యవసాయ విధానాలే ఇందుకు కారణం. ఆదిలాబాద్, కొమురంభీం, భద్రాద్రి జిల్లాల్లో సగటు భూకమతాలు వరుసగా 1.5, 1.4 మరియు 1.3 హెక్టార్లుగా వున్నాయి. అం టే ఈ జిల్లాల్లో వ్యవసాయ కార్యకలాపాలు చాలా అధికంగా వున్న సంగతి నిర్ధారణ అవుతోంది.ఇక వరంగల్, కరీంనగర్, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాల్లో సగటు భూకమతాల విస్తీర్ణం 0.6 నుంచి 0.8హెక్టార్లు మాత్రమే. ఈ జిల్లాల్లో చిన్నకమతాల సాగు లేదా భూవినియోగంలో ఇతర విధానాలు అమలుపరచడం ఇందుకు కారణం.
2023ా24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 994.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సగటు వర్షపాతం 919 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది అధికం. అయితే సీజన్ మొత్తం వర్షపాతంలో తీవ్రమైన వ్యత్యాసాలు నమోదు కావడం గతంతో పోలిస్తే గుర్తించదగిన మార్పు. నైరుతి రుతుపవనాలు 17% వ్యత్యాసాన్ని, ఈశాన్య రుతుపవనాలు 53% తగ్గుదలను నమోదు చేశాయి. ఇక శీతాకాలం 90% తగ్గిపోగా, వేడి వాతావరణం 45% వరకు పెరగడం గమనార్హం. ఈవిధంగా ఏడాది మొత్తంమీద వర్షపాతంలో 8% వ్యత్యాసం చోటుచేసుకుంది. వివిధ సీజన్లలో వర్షపాతంలో వచ్చిన మార్పు సుస్పష్టంగా కనిపిస్తోంది.
2021ా22 మరియు 2022ా23 సీజన్లలో వానాకాలం, యాసంగిలో విత్తిన విస్తీర్ణంలో పెరుగుదలను చూడవచ్చు. 2021-22లో వానాకాలం సీజన్‌లో పెరిగిన నికర విత్తిన విస్తీర్ణం 142 లక్షల హెక్టార్లు కాగా, 2022ా23లో ఇది 147 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే నికర విత్తిన విస్తీర్ణంలో 3.5% పెరుగుదల నమోదు చేసింది. ఇక యాసంగి పంటకు వస్తే 2021-22లో 56 లక్షల ఎకరాల్లో విత్తనాలు చల్లగా 2023-24 నాటికి ఈ విస్తీర్ణం 75లక్షలకు పెరిగింది. అదేవిధంగా సగటు విత్తిన విస్తీర్ణం 2021ా22లో 198లక్షల ఎకరాలు కాగా, 2023-24 సంవత్సరానికి ఇది 222లక్షల ఎకరాలకు పెరిగింది.
2021ా22 మరియు 2023ా24 సంవత్సరాల వానాకాలం సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం వరుసగా 43.79% మరియు 44.30%గా నమోదై తన ప్రాధాన్యతను నిలుపుకుంది. అదేవిధంగా పత్తి విస్తీర్ణం 32.90% మరియు 34.08%గా నమోదై వరి తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. ఇకమొక్కజన్న, కంది పంటల సాగు 5.44% మరియు 3.83% విస్తీర్ణం నుంచి 5.04% మరి యు 4.23%కు తగ్గిపోవడం గమనార్హం. ఇదే సమయంలో సోయాబీన్ సాగు 2.66% నుంచి 3.39%కు పెరిగింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే వరి,పత్తి పంటలకు ప్రాధాన్యత తగ్గలేదని, మొక్కజన్న, కంది మరియు సోయాబీన్ సాగుల్లో చాలా మార్పులు వచ్చాయన్న సంగతి స్పష్టమవుతోంది. 2021ా22 మరియు 2023ా24 సంవత్సరాల్లో యాసంగి సీజన్‌లో వరి తన ప్రాధాన్యతను నిలుపుకుంది. ఈ రెండు సీజన్లలో 63.46% నుంచి 76.66%కు పెరగడం గమనార్హం. ఇక మొక్కజన్న, సెనగ పంటల విస్తీర్ణం ఇదేకాలంలో తగ్గడం గమనార్హం. మొక్కజన్న 10.01% ఉంచి 8.71%కు, సెనగ 6.97% నుంచి 4.87%కు పడిపోయింది. వేరుశెనగ దారుణంగా 6.25% నుంచి ఏకంగా 3.13%కు క్షీణించడం గమనార్హం. అసలే చాలా తక్కువ విస్తీర్ణం లో సాగయ్యే జన్న పంట 2.34% నుంచి 1.73%కు మరింతగా పడిపోయింది.
2022ా23లో తెలంగాణలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 414లక్షల మెట్రిక్ టన్నులు. వీటిల్లో వరి, పత్తి, మొక్కజన్న పంటలు ప్రధానంగా వున్నాయి. రాష్ట్రంలో 122.45లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా 258లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చింది. పత్తి 50.03లక్షల ఎకరాల్లో సాగు చేయగా 30.59లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వచ్చింది. 12.74లక్షల ఎకరాల్లో సాగయిన మొక్కజన్న పంటనుంచి 28.65లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది.
2021ా22 మరియు 2023ా24 మధ్యకాలంలో ఒక్కో రకం పంట దిగుబడి ఎకరానికి కిలోగ్రాముల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. వరి ఎకరాకు 2064 కిలోగ్రాముల నుంచి 2108 కిలోలకు స్వ ల్పవృద్ధిని నమోదు చేయగా, మొక్కజన్న ఎకరాకు 2350 కిలోలనుంచి 2249 కిలోలకు తగ్గింది. ఇదే సమయంలో కందులు, సెనగల దిగుబడుల్లో మెరుగుదల కనిపించింది. కందులు ఎక రాకు 311 నుంచి 357కిలోలకు దిగుబడి పెరగ్గా, సెనగలు ఎకరాకు 570 నుంచి 634 కిలో లకు పెరిగింది. ఇదే సమయంలో పత్తి దిగుబడి ఎకరాకు 537 కిలోల నుంచి 611కిలోలకు పె రగ్గా, వేరుసెనగ 913 నుంచి 990 కిలోలకు పెరిగింది. నువ్వులు, సోయాబీన్, జన్న, పెసలు, మినుముల దిగుబడి దాదాపు స్థిరంగా వున్నదనే చెప్పాలి.
వ్యవసాయానికి మరింత వెన్నుదన్నుగా నిలవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల్లో కొన్ని మార్పులు చేపట్టడం ద్వారా రైతు అండగా నిలుస్తోంది. ముఖ్యంగా రైతు బంధు అమలుపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అర్హులు కాని వారికి కూడా రైతుబంధు నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో, నిజమైన రైతులకు మాత్రమే దీన్ని అందజేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు భరోసా పేరుతో నిజమైన రైతులకు ఎక రాకు ప్రస్తుతం అందజేస్తున్న రూ.10వేల మొత్తాన్ని రూ.15వేలకు పెంచింది. ఈ పథకాన్ని కౌ లు రైతులకు కూడా వర్తింపజేయడమే కాకుండా రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వడానికి కూడా నిర్ణయించింది. పథకం అమల్లో పారదర్శకతకోసం మరిన్ని మార్గదర్శకాలను రూపొందించి అమలు చేస్తోంది.
గత ప్రభుత్వం నిలిపివేసిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌లో అమలు చేసింది. ఈ పథకం అన్ని రకాల పంటలకు వర్తి స్తుంది. రైతు చెల్లించాల్సిన ప్రీమియంను రాష్ట్రప్రభుత్వం భరిస్తుంది. పంట విత్తిన దగ్గరినుంచి, కోత వరకు మరియు పంట దిగుబడి అంచనాకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చే స్తోంది.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సమన్వయంతో ప్రభుత్వం రైతు నేస్తం పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 110 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన రైతువేదికల ద్వారా, రైతుల్లో వివిధ అంశాలపై అవగాహన కలిగించడమే కాదు, వారు వ్యక్తం చేసే సందేహా లను అక్కడికక్కలే నివృత్తి చేస్తారు. ఇందుకోసం రైతువేదికల్లో జూమ్ సమావేశాలు ఏర్పాటు చే స్తారు. అంతేకాదు ప్రతి మంగళవారం ఈ కేంద్రాల్లో రైతు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం వున్న 110 రైతువేదికలను క్రమంగా 456 యూనిట్లకు పెంచడం ద్వారా రాష్ట్ర రైతు లకు మరింత అందుబాటులోకి వీటిని తీసుకువస్తారు.
ఈ ఏడాది ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేసింది. ఇందులో భాగంగా ఒక్కొక్క రైతు కుటుంబానికి అసలు వడ్డీతో కలిపి రూ.2లక్షల వరకు రుణమాఫీని ప్రభుత్వం అమలు చేసింది.
రాష్ట్రంలో సహకార రంగంలో తెలంగాణ కోాఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (మార్క్‌ఫెడ్) స హకార రంగంలో అత్యున్నత సంస్థగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ రుణ సహకార సంఘాలకు ఎరువులు సరఫరా చేసేందుకు వీలుగా అవసరమైన నిల్వలలను కొనసాగించడానికి మార్క్‌ఫెడ్‌ను ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది. అంతేకాకుండా కా యధాన్యాలు, పప్పుధాన్యాలను రైతులనుంచి ప్రభుత్వ మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చే స్తుంది. ఈ నేపథ్యంలో 2023ా24 ఆర్థిక సంవత్సరంలో మార్క్‌ఫెడ్ 887,647 మెట్రిక్ టన్ను ల ఎరువుల అమ్మకాలు జరిపింది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ జి ల్లాల్లోని 45వేల ఎకరాల్లో 5700 రైతులు నాణ్యమైన విత్తనాల సాగు కొనసాగుతోంది. వీటిని ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. కాగా రాష్ట్ర విత్తన మరియు ధ్రువీకరణ సంస్థ (టీజీఎస్‌ఎస్‌ఓసీఏ) నాణ్యమైన విత్తనాలను సర్టిఫై చేస్తుంది. ఈవిధంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందు బాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. 2023ా24 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ సీడ్ సర్టిఫికేషన్ కింద టీజీఎస్‌ఎస్‌ఓసీఏ సంస్థ 1,06,548 ఎకరాలను రిజిస్టర్ చేయగా, 16,46,000 క్వింటాళ్ల విత్తనాల ఉత్పత్తి జరుగుతుందని అం చనా. రాష్ట్రంలో విత్తన డిమాండ్‌కు అనుగుణంగా ఈ విత్తన ఉత్పత్తిని అంచనా వేస్తున్నారు.