వనపర్తి నేటిదాత్రి :
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు మొదటి ర్యాండమైజేషన్ అనంతరం ఈ వి.యం లను వనపర్తి సహాయ రిటర్నింగ్ అధికారి యం. నగేష్ కు అప్పగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు.
శనివారం ఉదయం K ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఈ .వి.యం గోదాం నుండి ప్రజా ప్రతినిదుల సమక్షంలో క్లోజ్డ్ కంటైనర్ లో పోలీస్ భద్రతతో చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ కు తరలించారు.
ఎన్నికల కమిషన్ సూచనల మేరకు బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ లను పోలీసు బందోబస్తు నడుమ చిట్యాలలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి యం. నగేష్, తహసిల్దార్ యాదగిరి, రమేష్ రెడ్డి, భాజపా ప్రతినిధులు దాసరాజు ప్రవీణ్, కుమారస్వామి, సీపీఎం ప్రతినిధి పరమేశ్వరాచారి, కాంగ్రెస్ ప్రతినిధి వేణాచారి, బీఎస్పీ నుంచి భరత్, తెలుగుదేశం పార్టీ నుండి కొత్త గొల్ల,శంకర్ ఎంఐఎం ప్రతినిధి రహీమ్ ల సమక్షంలో తరలిం చారు
ఈవీఎంలను రిటర్నింగ్ ఆ దికారి కి అప్పగింత
