వీణవంక, ( కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు 5 ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ అరుంధతి – గిరిబాబు , ఉప సర్పంచ్ రామగుండం రాజ్ కుమార్ వార్డ్ సభ్యుల పాలకవర్గ పదవి విరమణ కార్యక్రమం జరిగింది. పాలకవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అనంతరం ఉప సర్పంచ్ మాట్లాడుతూ… 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి పదవి విరమణ వరకు ప్రజాసేవే మాధవసేవగా పని చేస్తూ గ్రామ ప్రజలకు అండగా ఉన్నానని ప్రజల సహకారంతో పాలకవర్గం అండగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి దశలో ఉంచానని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఎల్ఈడి లైట్స్ రెండు సెంట్రల్ లైటింగ్ కూడా వేపించాము పల్లె ప్రకృతి వనం,డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం,అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ లు, వై కుంట ధామం, మన ఊరు మన బడి ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు మా హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు, సమావేశలో గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పంచాయతీ సెక్రెటరీ కాంశెట్టి శ్రీకాంత్ కారబర్ అంకుస్, ఫీల్డ్ అసిస్టెంట్ రఘు, ఆశ వర్కర్లు పానుగంటి శారద, కొడపల్లి జయంత, అంగన్వాడీ టీచర్స్ మల్లేశ్వరి, మాధవి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.