గోదావరి కార్మిక సంఘం నాయకుడు చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి బొగ్గు బావ లో పనిచేసి సింగరేణికి వెలుగులు తెచ్చిన సింగరేణి విశ్రాంతి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారి సమస్యలను గుర్తింపు సంఘాలు పరిగణలోకి తీసుకోవాలని *తెలంగాణ గోదావరి కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ పిలుపునిచ్చారు.
కనీసం పూర్తి సర్వీస్ (ల్చేసి దీన స్థితి లో కిరాయి ఇండ్లలో ఉంటూ కిరాయి కట్టలేక వచ్చే పెన్షన్ సరిపోక,రోగాలు ఖర్చులు పెట్టలేక ఉపాధి లేని బిడ్డలను పోషించలేక మానసిక వేదనతో బాధపడుతున్న విశ్రాంత కార్మికులకైనా 250 గజాలు ఇప్పిస్తే కార్మిక సంఘాలకు, సింగరేణి యాజమాన్యంకు,చొరవ చూపించే ప్రభుత్వం కు ఋణ పొడి ఉంటారు.మేము కంపెనీకి పూర్తి సర్వీస్ 30,35 ఏండ్లు సేవ చేయడం మేము చేసిన నేరమా!?,పాపమా!? మమ్మల్ని పట్టించుకునే దయామయుడే లేడా అని చింతిస్తున్నారు కావున అన్ని కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం,రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కనీసం పూర్తి సర్వీస్ సూపర్వైజర్ చేసిన విశ్రాంత కార్మికులకైనా 250గజాల స్థలం ఇప్పించే ఆలోచన చేయాలని, న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు. సింగరేణిలో గెలిచిన గుర్తింపు సంఘాల అయినటువంటి ఏఐటియుసి,ఐ ఎన్ టి యు సి కూడా కార్మికుల సమస్యల పట్ల పరిష్కరించే దశలో ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నాం