Seva Ratna National Award for Parkal Residents
సేవారత్న జాతీయ అవార్డు అందుకున్న పరకాల వాసులు
సామాజిక సేవలకు గాను గుర్తింపు
తిరుపతిలో సౌత్ ఇండియా కాన్ఫరెన్స్లో సత్కారం
పరకాల,నేటిధాత్రి
మండలంలోని లక్ష్మిపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆముదాలపల్లి మల్లేశం గౌడ్ మరియు పరకాల పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు మార్త బిక్షపతి లు సేవారత్న జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ సేవారత్న జాతీయ అవార్డును తెలంగాణ ప్రభుత్వ అడ్వైజరీ బోర్డు సభ్యులు దరువు ఎల్లన్న అవార్డు సెలెక్షన్ కమిటీ సభ్యులు బొమ్మకంటి రాజేందర్ ల ఆధ్వర్యంలో ఆదివారం వీరికి అందజేశారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలలో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అకాడమీ ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రదానం చేస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.పలు కార్యక్రమాల్లో వారు సేవలు అందించినందుకు వారి సేవలను గుర్తించి ఈ అవార్డు అందించినట్టు తెలిపారు.ఈ సందర్బంగా అవార్డు అందుకున్న ఇరువురు బహుజన సాహిత్య అకాడమీ చైర్మన్ కు మరియు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారికి పట్టణవాసులు,ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
