4 వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని వినతి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. రాబోయే రోజుల్లో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణంలోని 4 వ వార్డు కంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ అల్గోల్ సవిత్రమ్మ శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండేం నర్సింలు కు దరఖాస్తును సమర్పించారు. ఈ సందర్భంగా దరఖాస్తు సమర్పించిన సవిత్రమ్మ ప్రతినిది రవి కుమార్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యం, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశామని, గతంలో గ్రామ ఎంపిటిసి గా పోటీ చేసి విజయం సాధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినమని, కాలనీ వాసుల సమస్యల పరిష్కరం కోసం నిత్యం కృషి చేస్తున్నామని, తమ యొక్క అనుభవాన్ని, కృషిని గుర్తించి రాంజోల్ లోని 4 వ వార్డు జనరల్ మహిళగా రిజర్వు చేసినందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డా చంద్రశేఖర్, స్థానిక పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ లతో విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
