చందుర్తి, నేటిధాత్రి:
భారత జాతీయ 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, పలు కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థుల వివిధ వేషాధారణ చూపరులను ఆకర్షించాయి. గణతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి పాఠశాల ఆవరణలో అధ్యాపక బృందం పిల్లలకి వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లల ఆటపాటలు అలరించాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పత్తిపాక నాగరాజు బహుమతులు అందజేశారు.అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
నవత విద్యాలయంలో ఘనంగా జెండా పండగ
