ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
భద్రాచలం నేటి దాత్రి
పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఉత్సాహభరిత వాతావరణం లో నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యా సంస్థల ఆవరణలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశభక్తి జాతీయ గీతాలకు చిన్నారులు చేసి నృత్యం అదేవిధంగా స్వాతంత్ర పోరాటం పై ఉపన్యాస పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. వేడుకల్లో భాగంగా జాతీయ నాయకుల చిత్రపటాలకు విద్యాసంస్థల డైరెక్టర్ మాగంటి ప్రసాద్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించగా మరో డైరెక్టర్ మాగంటి రమేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాగంటి ప్రసాద్ బాబు రమేష్ బాబులు మాట్లాడుతూ ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాక మన రాజ్యాంగాన్ని మనమే రాసుకొని మన చట్టాలను మనమే రూపొందించుకొని స్వేచ్ఛ స్వాతంత్రం ప్రతి భారతీయుడికి అందాలన్న లక్ష్యంతో రాజ్యాంగాన్ని రూపొందించుకొని జనవరి 26 నుండి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకు వచ్చారని అందుకే జనవరి 26 గణతంత్ర దినోత్సవం గా దేశ ప్రజలు జరుపుకుంటున్నారని తెలిపారు. దేశంలో శాంతి సమగ్రతను కాపాడేందుకు విద్యార్థులు ముందుండాలని కోరారు. విద్యార్థి దశనుండే క్రమశిక్షణ అలవాటు చేసుకుంటూ దేశ ప్రతిష్టను పెంచే విధంగా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన దేశాలలో మన భారత విద్యార్థులే రాణిస్తున్నారని ఎంతోమంది మేధావులు మనదేశంలోనే స్వేచ్ఛ వాతావరణం లో విద్యను అభ్యసించి ప్రపంచంలో రాణిస్తున్నారని అది మన దేశం యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచుతుందని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించేందుకు లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలు కృషి చేస్తున్నాయని భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించేందుకు విద్యాసంస్థలు సిద్ధంగా ఉన్నాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు