Grand Republic Day Celebrations at Balaji Integrated Schools
బిట్స్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఘనంగా గణతంత్ర వేడుకలు
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలోగల బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, పాఠశాలల్లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
బాలాజీ విద్యాసంస్థల్లో భాగమైన అక్షరధా స్కూల్ అలాగే బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందనీ
అప్పటినుండి ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో జెండాను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల గౌరవం దేశభక్తి అలవర్చు కోవాలన్నారు. విద్యార్థులు జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భరతమాత, భగత్ సింగ్ వంటి నాయకుల వేషధారణలో అలరించారు.ఈ సందర్భంగా పిల్లలు వివిధ దేశభక్తి పాటలతో నృత్యాలతో అలరించారు.అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ జ్యోతి గౌడ్,అక్షర ధా స్కూల్ ప్రిన్సిపాల్ జి భవాని,ఉపాధ్యాయ బృందం బాలాజీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామరాజ్, లెక్చరర్స్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బిట్స్ విద్యాసంస్థల్లో…

దేశ సమగ్రతకు తీవ్రవాదం అడ్డంకిగా మారి ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దెబ్బతీస్తోందని వాటిని అధిగమించాలంటే మనం జీవితంలో ఎంతో క్రమశిక్షణను అలవర్చుకోవాల్సి ఉందని బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ. రాజేంద్రప్రసాద్ రెడ్డి అన్నారు. బిట్స్ లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించికొని చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

విద్యార్థులే దేశానికి వెన్నెముక అని.. చదువుతో పాటు నిజాయితీ సత్ప్రవర్తనలతో రానున్న భావితరాలకు ఆదర్శం కావాలని కోరారు. ఎందరో దేశభక్తులు స్వాతంత్రాన్ని సంపాదించి పెడితే మన రాజ్యాంగానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపకల్పన చేశారని, ఎంతో పేదరికాన్ని అనుభవించినా తాను కష్టపడి దేశ రాజ్యాంగాన్ని నిర్మించే శక్తిని సమకూర్చుకున్నారు. అటువంటి కష్టపడే లక్షణాన్ని విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలని హితవు చెప్పారు.ఆ తర్వాత బాలాజీ టెక్నోస్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. దీంతో పాటు విద్యార్థుల కరాటే విన్యాసాలు మరియు పిరమిడ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి.ఎస్. హరిహరన్,డాక్టర్ ఎ. శ్యామ్ సుందర్, డాక్టర్ ఎల్. సంపత్, డాక్టర్ పి. ప్రసాద్, జి. శ్రీనివాసులు, యం. భానురేఖ, కె. సంపత్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి. రాజేంద్రప్రసాద్, ఏ.ఓ.సురేష్ లు పాల్గొన్నారు.
