రేపు జాబ్మేళా
కాటారం మండలంలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 25వ తేదీ ఉదయం 10గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ జాబ్ మేళాను యువతి, యువకులు సద్వినియోగం చేసుకోగలరని కాటారం పోలీసులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ (అంబేద్కర్ స్టేడియం సమీపంలో) ఎస్పీ భాస్కరన్ అద్వర్యంలో ‘జాబ్ మేళా’ నిర్వహించబడునని అన్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన యువతి, యువకులు బుధవారం సాయంత్రం 5గంటలలోపు పేరు, సెల్ నంబర్ కాటారం పోలీస్స్టేషన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. అసక్తి గల యువతి, యువకులు గురువారం ఉదయం 8గంటలకు కాటారం పోలీస్స్టేషన్ నుండి బస్ల ద్వారా భూపాలపల్లి తీసుకువెళతారని తెలిపారు.