
ఆలయ చైర్మన్ ఉమేష్ గౌడ్
రేగొండ, నేటి ధాత్రి:
రేగొండ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం జరిగి 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నట్లు ఆలయ చైర్మన్ మోడెమ్ ఉమేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి పాలాభిషేకం ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.ఈ మేరకు గౌడ కులస్తులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమేష్ గౌడ్ కోరారు.