నడికూడ,నేటిధాత్రి:
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అభివృద్ధిలో భాగంగా మండలంలోని నార్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి రాజయ్య ఆధ్వర్యంలో నార్లాపూర్ గ్రామ శివారులోని కోమటికుంట కట్టకు వ్యవసాయ భూముల దగ్గరకు పోవడానికి వివిధ చెట్లు ఉండడం వల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అది గ్రహించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా జేసీబీ తెప్పించి జంగలి కటింగ్ నిర్వహించడం జరిగింది. జేసీబీ ఖర్చులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా నిర్వహించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,నడికూడ మండల సమన్వయ కమిటీ సభ్యులు పెద్ద బోయిన రవీందర్ యాదవ్,నడికూడ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగరపు సాంబయ్య,కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్య సలహాదారులు శనిగరపు వీరేశలింగం,బండ అశోక్,బండ శివ,భోగి మల్లేష్, శనిగరపు సుదర్శన్,శనిగరపు శ్రీధర్,శనిగరపు మొరళి, మెరుగు చిన్న కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కట్టకుఅడ్డుగా ఉన్నచెట్ల తొలగింపు
