మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ పై ఏసీబీ అధికారుల దాడి…

మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ పై ఏసీబీ అధికారుల దాడి

పదివేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కార్యదర్శి అనిల్

గంగాధర, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటున్నట్టు ఫిర్యాదు రావడంతో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ అధికారుల బృందం వల పన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మధురానగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు బిల్లు కోసం గ్రామ కార్యదర్శి నెల రోజుల నుంచి పదివేల రూ.లు డిమాండ్ చేయడంతో బాధితుడు కార్యదర్శి అనిల్ కు పదివేల రూపాయలు ఇవ్వగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో కార్యదర్శి లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి అనిల్ ను లంచం తీసుకున్న మొత్తం, సంబంధిత పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, దీపావళి పండుగ సందర్భంగా టపాసుల దుకాణాల పర్మిషన్ విషయంలో గాని, ఇతర గవర్నమెంట్ అధికారులు లంచం అడిగినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేయాల్సిందిగా ఏసిబి డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version