Ravikondalu Receives National Social Service Award
జాతీయస్థాయి అవార్డును అందుకున్న రవికొండలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
బహుజన సాహిత్య అకాడమీ సంస్థ జాతీయ స్థాయి ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డును 2026 సంవత్సరమునకు గాను జయమంగళ రవికొండలు అందుకున్నారు. మార్చి 15వ తేదిన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ నేషనల్ కాన్ఫరెన్స్లో అబహుజన సాహిత్య ఆకాడమి (బిఎస్ ఎ) జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు.సుబ్రమనియన్ గారి చేతులమీదుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సంధర్భంగా నల్లా రాధాకృష్ణ మట్లాడుతూ ఎస్సి, ఎస్టీ బిసి, మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలియజేశారు. సౌత్ ఇండియాలోని 6 రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు మరియు పుదిచ్చేరి రాష్ట్రాల నుండి సుమారుగా 600 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారని తెలియజేశారు. అవార్డులు అందజేసిన వారితో పాటు సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరి జి.విష్ణువర్దన్, కమిటీ సభ్యులు తాటికంటి ఐలయ్య, బాదె వెంకటేషం తదితరులు పాల్గొన్నారు.
