రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీపీ
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ ముస్లీంలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ కమిషనర్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్తో కలసి హన్మకొండ లోని బోక్కలగడ్డ ఈద్గాలో రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గోన్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈద్-ఉల్-ఫితర్ పండుగను ముస్లీంలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారని తెలిపారు. నెలరోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ప్రార్థనల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ప్రార్థనల్లో ముస్లిం పెద్దలు, చిన్నారులను అలింగనం చేసుకోని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం చిన్నారులకు పోలీస్ కమిషనర్ చాక్లెట్లు పంపిణీ చేశారు.