
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని రాజుపేట గ్రామానికి చెందిన తండ హరికృష్ణ గౌడ్ అనారోగ్యంతో గురువారం మరణించారు. ఈ సందర్భంగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హరికృష్ణ గౌడ్ పార్థీవ దేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హరికృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల సాంబయ్య గౌడ్, కక్కేర్ల యాదగిరి గౌడ్, రాజుపేట అధ్యక్షులు, కార్యదర్శులు గొల్లపెల్లి సురేష్ గౌడ్, తడుక శ్రీనివాస్ గౌడ్,జగిత్యాల ఈఓ పిఆర్డి తండ జగదీశ్ గౌడ్,అనంతుల రమేష్ గౌడ్, మడూరి యాదగిగౌడ్, తండ శ్రీధర్ గౌడ్, సారంగపాణి గౌడ్, లింగాల అనిల్, వడ్లకొండ సతీష్ గౌడ్, వడ్లకొండ సంతోష్ గౌడ్, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.