
Ramayampet Press Club
రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..
రామాయంపేట అక్టోబర్ 8 నేటిధాత్రి (మెదక్)

అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ.
రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏ క గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా చిర్ర సత్యనారాయణ, కోశాధికారిగా కట్ట ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా రాగి లింగం, సహాయ కార్యదర్శులుగా రామారపు యాదగిరి, కుస్టీ నారాయణ, ముఖ్య సలహాదారులుగా పాతూరి రమేష్ గౌడ్, ఉడెం దేవరాజు, మర్కు నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులకు అన్ని విధాలుగా తన వంతు ఎల్లప్పుడు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు.