కూకట్పల్లి, ఏప్రిల్ 12, నేటి ధాత్రిఇంచార్జ్
రంజాన్ పండుగ రోజు ఆయా ఈద్గాల వద్ద వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనం తరం మైనారిటీ సోదరులు వారితో ప్రార్థన కు వచ్చిన వారే, కాకుండా స్నేహితులు బంధువులకు ఆలింగనం చేసుకుంటూ, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు.ఈ సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ని 123 డివిజన్ లో ఉన్న హైదర్ నగర్ గ్రామంలోని పలు వురు మైనారిటీ ముస్లిం సోదరులు యువకులు మత పెద్దలు హైదర్నగర్లోని అంబా ఫర్నిచర్ షాప్లో కూర్చొని ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సత్యంగౌడ్ కు ప్రత్యేకంగా గుంపులు గుంపులుగా మైనారిటీ సోద రులు వచ్చి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియ జేస్తూ,సిర్కుంబాకు బదులు పేడ లడ్డు లను తినిపించారు.ఈ సందర్భంగా మన మంతా ఒకటే అన్న సంకే తంతో పెద్ద వయసుకు సంబంధించిన వారు,మరి కొంతమంది యువకులు కూడా అన్న దమ్ములాగా ఎంతో ఉల్లాసంతో కలవడం తనకెంతో ఆనందాన్ని కలిగిందని కూన సత్యంగౌడ్ తెలియజే శారు.ఈయనకు కలిసిన వారిలో షేక్ షరీఫ్,హమీద్,హా బీబ్ భాయ్,ముజ్జు భాయ్,జమీరు ద్దీన్,మాణిక్యం,మారుతిరావు,తది తరులు పాల్గొన్నారు.
హైదర్నగర్ లో ఘనంగా ముగిసిన రంజాన్ పండుగ ఎంతో జీవిత పాఠాన్ని నేర్పించింది రమదాన్:కూన
