నిజాంపేట: నేటి ధాత్రి
దివ్య ఖురాన్ అవతరించిన మాసం రంజాన్, నియమ నిష్టాలతో నెలరోజులపాటు ప్రతిరోజు ఐదు సార్లు నమాజులు, తరావిలు చేస్తూ ప్రత్యేక పాత్రను చేస్తారు. అలాగే ఉదయం సాహెర్ తో ప్రారంభించి ఇఫ్తార్ విరమణతో ముగించి ఉపవాసాలకు సెలవు పలికారు. మండలంలోని ముస్లిం సోదరులు ఉదయం కొత్త బట్టలు ధరించి సుగంధం పన్నీరు పూసుకుని ఉదయం 8 గంటలకు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా మత గురువు జనాభా అన్వర్ సాబ్ మాట్లాడుతూ ముస్లింలకు పవిత్రమైన మాసం రంజాన్ అని రంజాన్ సందర్భంగా 30 రోజులపాటు కటోర నియమాలతో ఉపవాస దీక్షలు చేసి ఉదయాన్నే షిర్ ఖుర్మా సేవించి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.