పాలకుర్తి నేటిధాత్రి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామ వాసి రమ (భర్త సోమశేఖర్)కు గురుకుల జూనియర్ లెక్చరర్ ఉద్యోగం రావటం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో మొదటి గురుకుల జూనియర్ లెక్చరర్ కావటం విశేషం. ప్రస్తుతం రమ కస్తూర్బా కాలేజ్ చిల్పుర్లో పి జి సి ఆర్ టి గా పని చేస్తుంది. మార్చి 4న ఎల్బి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకోనుంది.