కామారెడ్డిపల్లిలో ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాలతో ర్యాలీ
హాజరైన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ
పరకాల నేటిధాత్రి

మండలంలోని కామరెడ్డిపల్లి గ్రామంలో కొయ్యడ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘ నాయకులతో గ్రామంలో డప్పులలతో ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ మాట్లాడుతూఎస్సీ వర్గీకరణను ఏ,బి,సి,డి లుగా వర్గీకరించాలని కాంగ్రెస్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని లేకపోతే ఏ బి సి లుగా ఉంటే 57 కులాలకు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో అవకాశాలు కోల్పోతారని అణగారిన వర్గాలకు కూడా వర్గీకరణ ఫలాలు దక్కాలని ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా ఉద్యమం ద్వారా సాధించిన ఫలితాలను కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాక్ ఉన్నట్టుగా కంచంలో మెతుకుల్ని కాలితో తన్నినట్లుగా అవుతుందని గుర్తు చేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏ,బి,సి డిలుగా వర్గీకరించి ఆమోదింప చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో కామారెడ్డి పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు హనుమకొండ విజయ్ మాదిగ,కొయ్యడ అఖిల్,తిక్క రాజు,నాగెల్లి రఘు,కొయ్యడ జశ్వంత్,కొయ్యడ కొమరయ్య,కొయ్యడ రాజేష్,శ్రీపతి శివాజీ,తిక్క యశ్వంత్,కుల పెద్దలు పాల్గొన్నారు.