
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం టౌన్ దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుక భద్రాచలం పట్టణంలోని డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య నివాస గృహంలో కాంగ్రెస్ పార్టీ భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరిమి శ్రీనివాస రావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ చింతిర్యాల రవికుమార్ మాట్లాడుతూ… భారతదేశాన్ని ఐటి, టెలికాం, అంతరిక్ష పరిశోధన రంగాల్లో అగ్రగామిగా నిలిపి భారతదేశంలో సాంకేతిక టెక్నాలజీ విప్లవాన్ని తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఆదర్శ ప్రధాని అని కొనియాడారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఆయన వేసిన పునాదులు నేటికీ చిరస్మరణీయమన్నారు. భారతదేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారని రాజీవ్ సేవలను గుర్తు చేశారు. రాజీవ్ ఆశయ సాధనకు యువత నడుంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మల్ల వెంకటేశ్వర్లు, అడబాల వెంకటేశ్వరరావు, కొమ్మనపల్లి ఆదినారాయణ, బంధం శ్రీనివాస్ గౌడ్,బత్తుల తిరుపతయ్య, గర్నేపల్లి అశోక్, శీలం రామ్మోహన్ రెడ్డి, ఐఎన్టీయూసి సింగ్, రమేష్, వాసిరెడ్డి సాంబశివరావు, వరుణ్, అలీం, నాయుడు, సరిత, హసీనా, వసీమ, మైనారిటీ అలీం, కాపుల శ్రీను, బసవరాజు, అల్లాడి పాల్ రాజ్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు